Cyber Crime: సైబర్ నేరాలపై అప్రమత్తత అవసరం: తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి
ABN, Publish Date - Nov 09 , 2025 | 07:22 PM
నగర పోలీసుల ఆధ్వర్యంలో సైబర్‌క్రైమ్ నియంత్రణపై ఆదివారం హైదరాబాద్‌లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీజీపీ శివధర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీపీ సజ్జనార్‌తోపాటు పలువురు ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
నగర పోలీసుల ఆధ్వర్యంలో సైబర్‌క్రైమ్ నియంత్రణపై ఆదివారం హైదరాబాద్‌లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీజీపీ శివధర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీపీ సజ్జనార్‌తోపాటు పలువురు ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా డీజీపీ శివధర్‌రెడ్డి మాట్లాడుతూ.. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు డీజీపీ శివధర్ రెడ్డి సూచించారు. సైబర్ క్రైమ్ అవేర్‌నెస్ కార్యక్రమంలాగా కాకుండా.. దీనిని ఒక ఉద్యమంగా తీసుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సైబర్ కేటుగాళ్లకు ఇంట్లో ఉన్న మహిళలు, వృద్ధులు, గృహిణులు లక్ష్యంగా మారుతున్నారని పేర్కొన్నారు.
మహిళలు ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఫోన్లు చేసి భయపెట్టి మోసం చేస్తున్నారని వివరించారు. ప్రస్తుతం ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. యువత, రిటైర్ అయిన వారు, ప్రముఖులు అంతా ఈ అవేర్‌నెస్‌లో భాగం కావాలని సూచించారు.
ఫోన్ కాల్, సోషల్ మీడియా, ఆన్‌లైన్ ఇంటరాక్షన్‌తోనే సైబర్ కేటుగాళ్లు నేరాలు చేస్తున్నారని తెలిపారు. పాత నేరస్థుల మాదిరిగానే కొత్త నేరస్థులు సైతండేటాను సులభంగా సేకరిస్తున్నారని చెప్పుకొచ్చారు.
ఎవరు ధనవంతులు..? ఏ లొకేషన్‌లో ఉన్నారు? వయస్సు, లింగం వంటి వివరాలు అన్నీ తెలుసుకొని.. వారినే లక్ష్యంగా సైబర్ మోసగాళ్లు ఎంచుకుంటున్నారని పేర్కొన్నారు.
ఇది సాధారణ సమస్య కాదని.. ఒక తీవ్రమైన సామాజిక సమస్యగా మారిందని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు.
హైదరాబాద్‌లో సైబర్ అవేర్‌నెస్ ఉన్నప్పటికీ.. ఇంకా బాధితులు ఉన్నారని చెప్పారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం సైబర్ బాధితులు సంఖ్య తగ్గేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నామని వివరించారు.
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో 24 గంటలు ‘సైబర్ పెట్రోలింగ్’ ద్వారా పని చేస్తోందని వివరించారు.
హైదరాబాద్ సిటీలో ఇది ప్రారంభం మాత్రమేనని.. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా సైబర్ అవేర్‌నెస్ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి పేర్కొన్నారు.
Updated Date - Nov 09 , 2025 | 07:24 PM