CM Revanth Reddy: 70 ఏళ్ల కల త్వరలో నెరవేరబోతుంది..
ABN, Publish Date - Nov 24 , 2025 | 09:01 PM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.
త్వరలోనే కొడంగల్ ప్రజల 70 ఏళ్ల కల త్వరలో నెరవేరబోతుందన్నారు. మరో తొమ్మిది నెలల్లో రైల్వే లైన్ ఏర్పాటు పనులు ప్రారంభంకానున్నాయన్నారు.
ప్రతి పేద తల్లి కళ్లల్లో ఆనందం చూడాలని సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు.
ఆడబిడ్డలు సంతోషంగా ఉంటే.. రాష్ట్రంలో ఆర్థికాభివృద్ధి ఉంటుందని పేర్కొన్నారు. రూ. 500లకే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామన్నారు.
తమ ప్రభుత్వం మహిళల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని వివరించారు.
అదానీ, అంబానీలతో పోటి పడేలా సోలార్ ప్లాంట్స్ నిర్వహణను మహిళలకు అప్పగించామని వివరించారు.
Updated Date - Nov 24 , 2025 | 09:01 PM