ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

CM Revanth Reddy: సినీ కార్మికుల వెల్ఫేర్‌ ఫండ్‌లో ప్రభుత్వం రూ.10 కోట్లు డిపాజిట్‌: సీఎం రేవంత్

ABN, Publish Date - Oct 28 , 2025 | 08:36 PM

కళాకారులకు కావాల్సింది డబ్బు కాదు.. జనం కొట్టే చపట్లు.. కప్పే దుప్పట్లు అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సినీ కార్మికుల శ్రమ, కష్టం తనకు తెలుసునన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పదేళ్లు అవార్డులు ఇవ్వలేదని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాక గద్దర్‌ పేరు మీద సినీ అవార్డులు ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.

1/10

భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో సినీ పరిశ్రమకు ప్రాధాన్యం ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. సినీ కార్మికుల పిల్లల కోసం కార్పొరేట్‌ స్థాయి పాఠశాలలు నిర్మిస్తానని ఆయన ప్రకటించారు.

2/10

సినీ కార్మికుల పిల్లలకి ఉచితంగా చదువు చెప్పిస్తామని నొక్కిచెప్పారు. మంగళవారం యూసుఫ్‌గూడ పోలీస్‌ గ్రౌండ్‌లో సినీ కార్మికుల సమాఖ్య ఆధ్వర్యంలో సీఎం రేవంత్‌రెడ్డికి సన్మానం జరిగింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌‌రెడ్డిని సినీ ప్రముఖులు సన్మానించారు.

3/10

అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో నవీన్‌ యాదవ్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.

4/10

గతంలో తెలుగు పరిశ్రమని మదరాసి అని పిలిచేవారని చెప్పుకొచ్చారు. తెలుగు పరిశ్రమను హైదరాబాద్‌కు తరలి రావాలంటూ.. ఆనాటి సీఎం మర్రి చెన్నారెడ్డి తీవ్రంగా కృషి చేశారని గుర్తు చేశారు. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, కృష్ణ తదితరులు సీఎం చెన్నారెడ్డి సంప్రదించి తెలుగు పరిశ్రమ హైదరాబాద్‌కు వచ్చేందుకు కృషి చేశారని వివరించారు.

5/10

చిత్రపురి కాలనీకి ప్రపంచస్థాయి గుర్తింపునకు ఆనాటి నాయకులు కృషి చేశారని తెలిపారు. చిత్రపరిశ్రమను ప్రోత్సహించాలని తక్కువ ధరకే స్టూడియోలకు భూములు ఇచ్చామన్నారు. రామానాయుడు, పద్మాలయా, అన్నపూర్ణ స్టూడియోలకు అప్పటి సీఎంలు చౌకగా భూములు కేటాయించారని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

6/10

కళాకారులకు కావాల్సింది డబ్బు కాదు.. జనం కొట్టే చపట్లు.. కప్పే దుప్పట్లు. సినీ కార్మికుల శ్రమ, కష్టం తనకు తెలుసునన్నారు.

7/10

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పదేళ్లు అవార్డులు ఇవ్వలేదని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాక గద్దర్‌ పేరు మీద సినీ అవార్డులు ఇచ్చాన్నారు.

8/10

హైదరాబాద్‌ నగరం ప్రపంచ సినీ పరిశ్రమకు వేదిక కావాలనేది తన సంకల్పమన్నారు.

9/10

సినీ కార్మికుల కోసం తమ ప్రభుత్వం తరఫున చేయగలిగిన పనులు చేస్తాన్నారు. సినీ కార్మికుల కోసం వెల్ఫేర్‌ ఫండ్‌ ఏర్పాటు చేస్తున్నామని. సినీ కార్మికుల వెల్ఫేర్‌ ఫండ్‌లో తమ ప్రభుత్వం తరఫున రూ.10కోట్లు డిపాజిట్‌ చేస్తామని చెప్పారు.

10/10

సినిమా టికెట్లు పెంపు ద్వారా వచ్చిన ఆదాయంలో 20 శాతం కార్మికులకు ఇవ్వాలని సినీ పెద్దలకు సూచించారు. కార్మికులకు లాభాల్లో 20 శాతం ఇస్తేనే టికెట్ల ధరలు పెంచుకునేందుకు జీవో ఇస్తామని ప్రకటించారు. అలాగే సినీ కార్మీకులకు ఈ సందర్భంగా పలు హామీలు ఇచ్చారు.

Updated Date - Oct 28 , 2025 | 08:39 PM