Sravana Sukravaram Satyanarayana Swamy Vratham 2025: శ్రావణ శుక్రవారం.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు
ABN, Publish Date - Aug 08 , 2025 | 05:48 PM
శ్రావణ శుక్రవారం కావడంతో భక్తులు ఆలయాలకు పోటెత్తారు. సామూహిక సత్యనారాయణ వ్రతం నిర్వహించారు. ఈ వ్రతం ఆచరించేందుకు భక్తులు భారీగా దేవాలయాలకు తరలి వచ్చారు.
శ్రావణ శుక్రవారం.. అందునా పౌర్ణమి ఘడియలు కూడా రావడంతో భక్తులు ఆలయాలకు పోటెత్తారు.
భక్తి శ్రద్దలతో వరలక్ష్మీ వ్రతాన్ని భక్తులు ఆచరించారు.
వరలక్ష్మీ శుక్రవారం కావడంతో.. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని అన్ని దేవాలయాలను పూలతో గాజులతో అందంగా అలంకరించారు.
సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి దేవాలయాన్ని గాజులతో అలంకరించారు.
ఈ రోజు తెల్లవారుజాము నుంచి అమ్మవారిని దర్శించుకునేకు ఈ దేవాలయానికి భక్తులు క్యూ కట్టారు.
అలాగే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పక్కనే ఉన్న గణేష్ టెంపుల్‌లో సామూహిక సత్యనారాయణ వ్రతాన్ని నిర్వహించారు. ఈ వ్రతానికి భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.
అలాగే చందానగర్‌లోని శ్రీవెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో సైతం శ్రావణ శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మరోవైపు పౌర్ణమి శుక్రవారం మధ్యాహ్నం నుంచి శనివారం మధ్యాహ్నం వరకు ఉంది.
శుక్రవారం మధ్యాహ్నం నుంచి పౌర్ణమి ఘడియలు రావడంతో.. పలు దేవాలయాల్లో శ్రీ లలిత సహస్ర నామ స్తోత్ర పారాయణంతోపాటు అమ్మవారి కుంకుమార్చనను సైతం నిర్వహిస్తున్నారు.
Updated Date - Aug 08 , 2025 | 05:49 PM