రాగస్వర సుప్రభాతం అగర్‌బత్తిని ఆవిష్కరించిన చిన్న జీయర్ స్వామి
ABN, Publish Date - Dec 30 , 2025 | 08:29 PM
రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ సమత మూర్తి స్ఫూర్తి కేంద్రంలో ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ దండి చిన్న జీయర్ స్వామి రాగస్వర సుప్రభాతం నూతన అగర్‌బత్తిని ఆవిష్కరించారు.
వైకుంఠ ఏకాదశి సందర్భంగా అంబికా దర్బార్ బత్తి సంస్థ రాగస్వర సుప్రభాతం అనే నూతన అగర్‌బత్తి ప్రొడక్ట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఈ అగర్‌బత్తి ప్రొడక్ట్‌ను ముచ్చింతల్ సమత మూర్తి స్ఫూర్తి కేంద్రంలో ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ దండి చిన్న జీయర్ స్వామి ఆవిష్కరించారు.
ఈ అగర్‌బత్తి బాక్స్ తెరిచిన వెంటనే ఆటోమేటిక్‌గా సుప్రభాత శ్లోకాలు వినిపించడం దీని ప్రత్యేకత.
125 ఏళ్లుగా అంబికా సంస్థ నాణ్యమైన సుగంధ ద్రవ్యాలతో భగవంతుడికి, భక్తుడికి అనుసంధానకర్తగా నిలుస్తోందని చినజీయర్ స్వామి కొనియాడారు.
అగర్‌బత్తులు అయిపోయిన తర్వాత కూడా ఈ బాక్స్‌ను పూజా గదిలో మ్యూజిక్ ప్లేయర్‌గా ఉపయోగించుకోవచ్చు.
Updated Date - Dec 30 , 2025 | 08:32 PM