Telangana Floods: భారీ వరదలు.. ప్రమాదకరంగా పోచారం డ్యామ్..
ABN, Publish Date - Aug 28 , 2025 | 05:16 PM
గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మెదక్ జిల్లాలోని పోచారం డ్యామ్‌కు భారీగా వరద వచ్చి చేరుతోంది. డ్యామ్‌పై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది.
మెదక్ జిల్లాలోని పోచారం డ్యామ్‌కు వరద ప్రవాహం ఉధృతంగా వస్తోంది.
పోచారం డ్యామ్‌పై నుంచి వరద నీరు పొంగి పొర్లుతోంది.
పోచారం డ్యామ్ వద్ద నీటి ప్రవాహం ఉధృతంగా ఉండటంతో మెదక్ నుంచి కామారెడ్డి జిల్లాకు వెళ్లే రహదారి కొట్టుకుపోయింది.
వరద నీటి ప్రభావంతో పంట పొలాలన్నీ నీటమునిగిపోయాయి.
నీటి ఉధృతికి కరెంట్ స్తంభాలు, ట్రాన్స్‌ఫర్మర్‌లు, వైర్లు పడిపోయాయి. స్తంభాలు విరిగిపోయాయి.
వరద ఉధృతితో రోడ్డు కొట్టుకుపోవడంతో పోలీసులు వహనాల రాకపోకలను నిలిపివేశారు.
మెదక్ నుంచి కామారెడ్డి జిల్లాకు వెళ్లే రహదారి పూర్తిగా ధ్వంసం అవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పోచారం డ్యామ్ పొంగిపొర్లుతున్న నేపథ్యంలో పర్యాటకులు, సందర్శకులు రాకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.
పోచారం డ్యామ్ నుంచి వస్తున్న వరద నీటిలో పలువురు చిక్కుకున్నారు.
Updated Date - Aug 28 , 2025 | 05:16 PM