Pawan Kalyan: హైదరాబాద్‌లో అధికార భాష విభాగం స్వర్ణోత్సవ వేడుకలు
ABN, Publish Date - Jul 11 , 2025 | 07:46 PM
హైదరాబాద్, గచ్చిబౌలిలోని బాలయోగి స్టేడియంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అధికార భాష విభాగం స్వర్ణోత్సవ వేడుకలు జరిగాయి. ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, విశిష్ట అతిధిగా పవన్ కళ్యాణ్..
దేశంలో అధికారిక భాషా విభాగం స్థాపించి యాభై సంవత్సరాలు పూర్తి
అధికారిక భాషా విభాగం స్వర్ణోత్సవ వేడుక 'దక్షిణ్ సంవాద్'
ఈరోజు (జూలై 11)న భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖకు చెందిన రాజ్ భాషా విభాగ్ ఆధ్వర్యంలో కార్యక్రమం
హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలోని జిఎంసి బాలయోగి ఇండోర్ స్టేడియం వేదిక
ముఖ్య అతిథిగా కేంద్ర బొగ్గు, గనుల మంత్రి కిషన్ రెడ్డి, ప్రత్యేక అతిథిగా రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్
విశిష్ట అతిథిగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
అతిథులుగా హిందీ విద్యావేత్త ప్రొఫెసర్ మాణిక్యాంబ, ప్రొఫెసర్ అనంత్ కృష్ణన్, అధికారిక భాషా విభాగం కార్యదర్శి అన్షులి ఆర్య,
తన ప్రసంగాన్ని సరస్వతి మాత పవిత్ర పాదాలకు నమస్కరించి ప్రారంభించిన పవన్ కళ్యాణ్
హిందీ సేవ, అన్ని మాతృభాషల పట్ల గౌరవం చూపిన ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోం, సహకార మంత్రి అమిత్ షా లకు కృతజ్ఞతలు తెలిపిన పవన్ కళ్యాణ్ .
దేశాన్ని ఐక్యంగా ఉంచడంలో, భాషా ఐక్యతను, సాహిత్య ప్రచారాన్ని కొనసాగించడంలో హిందీ పాత్రను నొక్కిచెప్పిన పవన్ కళ్యాణ్
అధికారిక భాష హిందీ యొక్క స్వదేశీ, ప్రపంచ ప్రాముఖ్యతను స్పష్టం చేసిన పవన్.
హిందీని ప్రేమించాలని, హిందీని అభివృద్ధి చేయాలని, హిందీని ముందుకు తీసుకెళ్లాలని ప్రజలకు విజ్ఞప్తి చేసిన పవన్.
Updated Date - Jul 11 , 2025 | 07:47 PM