ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Old City: పాత బస్తీలో భారీ అగ్ని ప్రమాదం.. రంగంలోకి పోలీసులు

ABN, Publish Date - Nov 25 , 2025 | 11:55 AM

హైదరాబాద్ పాతబస్తీలోని శాలిబండలో గోమతి ఎలక్ట్రానిక్స్‌లో అగ్నిప్రమాదం జరిగింది. బుధవారం రాత్రి జరిగిన ఈ అగ్నిప్రమాదంలో ఈ షోరూం పూర్తిగా దగ్ధమైంది. కోట్లాది రూపాయిలు విలువ చేసే వస్తువులు కాలి బూడిదయ్యాయి. ఈ ప్రమాద ఘటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

1/6

హైదరాబాద్ పాతబస్తీలోని శాలిబండలో గోమతి ఎలక్ట్రానిక్స్‌లో అగ్నిప్రమాదం జరిగింది. బుధవారం రాత్రి జరిగిన ఈ అగ్నిప్రమాదంలో ఈ షోరూం పూర్తిగా దగ్ధమైంది. కోట్లాది రూపాయిలు విలువ చేసే వస్తువులు కాలి బూడిదయ్యాయి.

2/6

ఈ ప్రమాద ఘటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అగ్ని ప్రమాదానికి కారణమైన కారు చార్మినార్ నుంచి లాల్‌దర్వాజా వెళుతూ ఒక్కసారిగా గోమతి ఎలక్ట్రానిక్స్ షోరూంను ఢీకొట్టిందని.. కారులోని ఏసీ కంప్రెజర్ పేలి మంటలు షోరూంను అంటుకున్నాయని వాదన వినిపిస్తుంది.

3/6

షోరూంలో షార్ట్‌సర్క్యూట్ ఏర్పడడం కారణంగా ఈ ప్రమాదం జరిగిందనేది మరో వాదన.

4/6

షాపులో షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు బయటకు వ్యాపించాయని.. అదే సమయంలో అటుగా వెళ్తున్న కారుకు మంటలు అంటుకోవడంతో అందులో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలి ఈ ప్రమాదం జరిగిందనే ఇంకో వాదన వినిపిస్తోంది.

5/6

ఈ నేపథ్యంలో ఈ అగ్ని ప్రమాద ఘటనపై మొగల్‌పురా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

6/6

ఈ ప్రమాదం ఎలా జరిగింది? ఈ ప్రమాదానికి గల ప్రధాన కారణం ఏమిటి అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కారు పూర్తిగా కాలిపోవడం.. ఒక వ్యక్తి మరణించడంతో దీని వెనుక ఏమైనా కుట్ర ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదంలో ఒకరు మరణించారు. మరో 30 మంది గాయపడ్డారు.

Updated Date - Nov 25 , 2025 | 11:56 AM