ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Sri Ramakonda Temple in Mahbubnagar: అమావాస్య.. శ్రీరామకొండకు పోటెత్తిన భక్తులు

ABN, Publish Date - Sep 21 , 2025 | 02:27 PM

మహబూబ్‌నగర్‌ జిల్లా కోయిలకొండ మండల కేంద్రంలోని శ్రీరామకొండకు భక్తులు పోటెత్తారు. ఈ రోజు ఆదివారం.. అందునా మహాలయ పక్ష అమావాస్య కావడంతో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీరామకొండకు భక్తులు వెల్లువెత్తారు. ఈ సందర్భంగా శ్రీరాముడికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు వేల సంఖ్యలో తరలి వచ్చారు.

1/9

మహబూబ్‌నగర్‌ జిల్లా కోయిలకొండ మండల కేంద్రంలోని శ్రీరామకొండకు భక్తులు పోటెత్తారు. అందునా ఆదివారం.. అది కూడా మహాలయ పక్ష అమావాస్య కావడంతో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీరామకొండకు భక్తులు వెల్లువెత్తారు.

2/9

ఈ సందర్భంగా శ్రీరాముడికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు వేల సంఖ్యలో తరలిరావడంతో అందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు.

3/9

ప్రతి ఏడాది ఏప్రిల్ మాసంలో వచ్చే అమావాస్య రోజు.. భారీ ఎత్తు జాతర నిర్వహిస్తారు. ఈ జాతరకు తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి భక్తులు భారీగా శ్రీరామకొండకు తరలి వస్తారు. అందుకోసం జిల్లా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు.

4/9

త్రేతాయుగంలో శ్రీరాముడు తన భార్య సీతాదేవి, సోదరుడు లక్ష్ముణుడితో కలిసి వనవాసంకు వెళ్లారు. ఆ సమయంలో వీరు.. ఈ కొండపై విశ్రాంతి తీసుకున్నట్లు చెబుతారు. అందుకే ఈ కొండను శ్రీరామకొండ అని పిలుస్తారు.

5/9

శ్రీరాముని పాద ముద్రతు నేటికి కనిపించడం విశేషం. భక్తుల సైతం ఆ పాదాలను సందర్శిస్తారు.

6/9

ఇక కొండపై సీతాదేవి కూర్చొన్న రాయిని సీతమ్మ గుండుగా పిలుస్తారు. అనంతరం ఈ కొండపై ఋషులు సైతం తపస్సు చేశారని అంటారు.

7/9

ఈ కొండపై కోనేరు ఉంటుంది. దాంట్లో నీరు నిత్యం నిండుగా ఉంటుందంటారు.

8/9

ఈ దేవాలయం చారిత్రాత్మక కోయిలకొండ కోట సమీపంలో ఉంది. ఈ దేవాలయాన్ని సందర్శించిన భక్తులు.. ఈ కోటను సైతం సందర్శిస్తారు.

9/9

ఈ కొండపై రాముడి దర్శనం అనంతరం కోనేటిలోని నీటిని.. అక్కడి చెట్టు కొమ్మలను భక్తులు ఇంటికి తీసుకు వెళ్లారు. అమావాస్య రోజు కొండపై ఉన్న మొక్కలు సంజీవనిగా మారతాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు.

Updated Date - Sep 21 , 2025 | 02:27 PM