బాబోయ్ చలి .. పడిపోతున్న ఉష్ణోగ్రతలు
ABN, Publish Date - Dec 06 , 2025 | 05:56 PM
తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. ఉష్ణోగ్రతలు బాగా పడిపోతున్నాయి. పలు జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు గజగజ వణుకుతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రజలు చలికి ఇబ్బందులు పడుతున్నారు.
సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు చలిమంట కాచుకుంటున్నారు.
హైదరాబాద్‌లో జెన్టీయూ, KPHB రోడ్, జగత్ గిరి గుట్టలో చలి తీవ్రతలోనూ పారిశుద్ధ్య కార్మికులు రోడ్లను శుభ్రం చేస్తున్నారు.
సాధారణంగానే పేపర్ బాయ్స్.. వేకువజామునే తమ పనిని ప్రారంభిస్తారు. అయితే, ప్రస్తుతం చలి ఎక్కవుగా ఉండడంతో స్వెట్టర్లు ధరించి మరీ, ఏమాత్రం ఆలస్యం కాకుండా వార్తపత్రికలను సిద్ధం చేస్తున్నారు.
జగత్ గిరి గుట్ట, KPHB, వివేకానంద నగర్ బస్టాప్ లలో నిరాశ్రయులు విశాంత్రి తీసుకుంటున్నారు.
రానున్న రోజుల్లో చలి మరింత పెరుగుతుందని, జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.
Updated Date - Dec 06 , 2025 | 06:02 PM