Mutton Shops Full Rush In Hyderabad: మటన్ షాపుల ముందు బారులు తీరిన జనం
ABN, Publish Date - Oct 01 , 2025 | 08:16 PM
అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి. ఈ నేపథ్యంలో మద్యం, మాంసం షాపులు బంద్ చేయాలని ఇప్పటికే ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మటన్, చికెన్ షాపులు మూతబడనున్నాయి. దాంతో అక్టోబర్ 1వ తేదీనే మాంసాహార ప్రియులు.. చికెన్, మటన్ షాపులకు భారీగా క్యూ కట్టారు.
అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి. ఈ నేపథ్యంలో మద్యం, మాంసం షాపులు బంద్ చేయాలని ఇప్పటికే ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
ఈ నేపథ్యంలో మటన్, చికెన్ షాపులు మూతబడనున్నాయి. దాంతో అక్టోబర్ 1వ తేదీనే మాంసాహార ప్రియులు.. చికెన్, మటన్ షాపులకు భారీగా క్యూ కట్టారు.
దీంతో హైదరాబాద్ జంట నగరాల్లోని దాదాపుగా అన్ని షాపులు మాంసాహార ప్రియులతో కిక్కిరిసి పోయాయి. అదీకాక.. అక్టోబర్ 2వ తేదీ దసరా పండగ వచ్చింది.
పండగ వేళ.. సైతం పలువురు మాంసాహారాన్ని వండుకుంటారు.
ఆ క్రమంలో అక్టోబర్ 2వ తేదీ దుకాణాలు మూసి వేస్తారని తెలిసి జనం.. ముందుగానే మాంసం కొనుగోలు చేసేందుకు ఇలా షాపుల వద్ద బారులు తీరారు.
Updated Date - Oct 01 , 2025 | 08:17 PM