Ganesh immersion Yadadri Bhuvanagiri: భువనగిరి గణేష నిమజ్జనాల్లో భక్తుల రాస్తారోకో..
ABN, Publish Date - Sep 06 , 2025 | 07:34 PM
యాదాద్రి భువనగిరిజిల్లాలో గణేషుని శోభాయాత్ర కోలాహలంగా సాగింది. అయితే, పోలీసుల తీరును నిరసిస్తూ భక్తులు పలుచోట్ల రాస్తారోకోను చేపట్టారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలో లంబోదరుని నిమజ్జన మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి.
శనివారం తెల్లవారుజామున నుంచే గణనాథుని శోభాయాత్ర మొదలైంది. నగరంలోని వీధులు జనాలతో కిక్కిరిసిపోయాయి.
పరమేశ్వర పుత్రుడుని చివరిరోజున దర్శించుకునేందుకు నగరవ్యాప్తంగా ఉన్న భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
అయితే, భువనగిరిలో పలుచోట్ల భక్తులు శోభాయాత్రలో పోలీసుల తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు.
వందలమంది జనాలు రోడ్లపైకి వచ్చి రాస్తారోకో చేశారు. అయితే, పోలీసులు కాసేపట్లోనే భక్తులను శాంతపరచడంతో వివాదం సద్దుమణిగింది.
Updated Date - Sep 06 , 2025 | 07:34 PM