Sravana Masam Varalakshmi Vratham 2025: వరలక్ష్మీ వత్రం వేళ.. మార్కెట్లు కిటకిట..
ABN, Publish Date - Aug 07 , 2025 | 07:22 PM
శ్రావణ పౌర్ణమి ఆగస్ట్ 08వ తేదీన వచ్చింది. అంటే శుక్రవారం మధ్యాహ్నం నుంచి పౌర్ణమి ఘడియలు వచ్చాయి. ఈ ఘడియలు శనివారం మధ్యాహ్నం వరకు ఉంటాయి.
శ్రావణ మాసం అంటే.. శుభాలకు.. శుభముహూర్తాలకు నెలవు.
అలాంటి మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారాన్ని శ్రావణ శుక్రవారంగా మహిళలు పరిగణిస్తారు.
ఆ రోజు వరలక్ష్మి వ్రతాన్ని వారంతా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు.
ఈ వ్రతం చేసుకుంటే.. శ్రీమహాలక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుందని విశ్వసిస్తారు.
అదీకాక ఈ ఏడాది శ్రావణ పౌర్ణమి ఆగస్ట్ 08వ తేదీన వచ్చింది.
అంటే శుక్రవారం మధ్యాహ్నం నుంచి పౌర్ణమి ఘడియలు వచ్చాయి.
ఈ పౌర్ణమి ఘడియలు శనివారం మధ్యాహ్నం వరకు ఉంటాయి.
ఇక శనివారం రాఖీ పౌర్ణమి జరుపుకోనున్నారు.
ఈ రెండు పండగలు వరుసగా రావడంతో వరలక్ష్మీ వత్రానికి కావాల్సిన పువ్వులు, పూజా సామాగ్రి కొనుగోలు చేయనున్నారు.
ఆ క్రమంలో పూల మార్కెట్లు మహిళలతో కిటకిటలాడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత పరిస్థితి ఇలా ఉంది.
కర్నూలులో పూలు కొనుగోలు చేస్తున్న ప్రజలు
కర్నూలు కొండ రెడ్డి బురుజు వద్ద గాజులు కొనుగోలు చేస్తున్న మహిళలు
అనంతపురంలోని పాతురు రోడ్డులో పూలు, అరటి ఆకులు కొనుగోలు చేసుకుని ఇంటికి తీసుకు వెళ్తున్న మహిళలు
అనంతపురంలోని పాతురు రోడ్డులో వరలక్ష్మీ వ్రతం కోసం అరటి చెట్టును కొనుగోలు చేస్తున్న యువతి
Updated Date - Aug 07 , 2025 | 07:35 PM