Dasara Celebrations In Andhrajyothi Press Office: దసరా వేడుకలు.. వేమూరి ఆదిత్య దంపతులు ప్రత్యేక పూజలు
ABN, Publish Date - Oct 02 , 2025 | 03:57 PM
కూకట్‌పల్లిలోని ప్రశాంత్ నగర్ ప్రింటింగ్ కార్యాలయంలో దసరా వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఆంధ్రజ్యోతి డైరెక్టర్ వేమూరి ఆదిత్య, ఆయన సతీమణి, వైస్ ప్రెసిడెంట్ శ్రుతికీర్తి పాల్గొన్నారు.
హైదరాబాద్, అక్టోబర్ 02: కూకట్‌పల్లిలోని ప్రశాంత్ నగర్ ప్రింటింగ్ కార్యాలయంలో దసరా వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఆంధ్రజ్యోతి డైరెక్టర్ వేమూరి ఆదిత్య, ఆయన సతీమణి, వైస్ ప్రెసిడెంట్ శ్రుతికీర్తి పాల్గొన్నారు.
కార్యాలయంలో ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహానికి వేమూరి ఆదిత్య దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అయితే తొలుత ప్రింటింగ్ కార్యాలయం ముఖ ద్వారం వద్ద డైరెక్టర్ వేమూరి ఆదిత్య గుమ్మడి కాయ కొట్టారు.
దసరా పర్వదినం నేపథ్యంలో ప్రత్యేక పూజలు కోసం కార్యాలయానికి వచ్చిన డైరెక్టర్ ఆదిత్య దంపతులను ప్రచురణకర్త శేషగిరిరావు, ప్రింటింగ్ ప్రెస్ డీజీఎంలు రాంప్రసాద్,చినబాబు,చౌదరి తదితరులు వారిని సాదరంగా ఆహ్వానించారు.
ప్రింటింగ్ కార్యాలయంలోని వివిధ విభాగాలను వారు సందర్శించారు. మెషినరీకి సైతం వారు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం సిబ్బందికి తీర్థ ప్రసాదాలు అందించారు.
ఈ పూజల్లో ప్రింటింగ్ స్టోర్స్ మేనేజర్ వైసీ నర్సింహా, అసిస్టెంట్ మేనేజర్లు భానుప్రకాశ్, హరికృష్ణ, మాధవరావు, ఆర్‌ఎం అనిల్‌కుమార్, సిబ్బంది కే రాజు, సింహాచలం, సురేశ్, బార్గవ, నిర్మల యాదవమ్మ, సాంబ, కిషోర్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
ఇక దసరా నవరాత్రులు ప్రారంభం సందర్భంగా సెప్టెంబర్ 23వ తేదీ.. ప్రింటింగ్ కార్యాలయంలో అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి.. ప్రత్యేక పూజలను డైరెక్టర్ వేమూరి ఆదిత్య దంపతులు నిర్వహించిన సంగతి తెలిసిందే.
Updated Date - Oct 02 , 2025 | 03:58 PM