ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

CM RevanthReddy: హిరోషిమాలో రేవంత్‌ బృందం పర్యటన

ABN, Publish Date - Apr 23 , 2025 | 07:23 AM

తెలంగాణ రైజింగ్‌ బృందంతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఏప్రిల్ 16వ తేదీన జపాన్‌ వెళ్లిన విషయం తెలిసిందే. బుధవారం ఉదయం రేవంత్ తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు. చివరి రోజైన మంగళవారం హిరోషిమాలో రేవంత్‌ బృందం పర్యటించింది. హిరోషిమా శాసన సభ్యుల బృందం రేవంత్‌రెడ్డిని గాంధీ మెమోరియల్‌, హిరోషిమా పీస్‌ మెమోరియల్‌ పార్క్‌, అణుబాంబు డోమ్‌ల వద్దకు తీసుకెళ్లింది.

1/6

హిరోషిమాలో తెలంగాణ సీఎం రేవంత్‌‌రెడ్డి బృందం మంగళవారం నాడు పర్యటించింది. హిరోషిమా శాసన సభ్యుల బృందం రేవంత్‌రెడ్డిని గాంధీ మెమోరియల్‌, హిరోషిమా పీస్‌ మెమోరియల్‌ పార్క్‌, అణుబాంబు డోమ్‌ల వద్దకు తీసుకెళ్లింది.

2/6

గాంధీ విగ్రహానికి పూలమాల వేసి రేవంత్‌ నివాళి అర్పించారు. శాంతి స్మృతివనం వద్ద అణుబాంబు ఘటనలో మృతిచెందిన వారికి పుష్పాంజలి ఘటించారు.

3/6

1945లో హిరోషిమాపై జరిగిన దాడి నాటి భవన శిథిలం ‘ఆటమిక్‌ బాంబ్‌ డోమ్‌’ను కూడా సీఎం రేవంత్‌‌రెడ్డి సందర్శించారు.

4/6

అనంతరం హిరోషిమా డిప్యూటీ గవర్నర్‌ మికాయొకాటాతో సమావేశమయ్యారు.

5/6

ఈ సందర్భంగా ఆయనతో సీఎం రేవంత్‌, మంత్రి శ్రీధర్‌బాబు తెలంగాణ, హిరోషిమా కలిసి పని చేయగలిగే రంగాలపై చర్చలు జరిపారు.

6/6

స్పీకర్‌ తకాషి నకమోటో సీఎం రేవంత్‌, మంత్రి శ్రీధర్‌బాబులకు సాదరస్వాగతం పలికారు. అలాగే గాంధీ మెమోరియల్‌ దగ్గర సీఎంకు స్థానికంగా చదువుతున్న హాసిని, హరిణి పాటలతో ఆహ్వానించారు.

Updated Date - Apr 23 , 2025 | 07:31 AM