ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Montha Cyclone: హనుమకొండలో సీఎం రేవంత్ పర్యటన..

ABN, Publish Date - Oct 31 , 2025 | 08:52 PM

మొంథా తుపాను కారణంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలని పలు ప్రాంతాలు నీటిలో చిక్కుకుపోయాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హనుమకొండలో పర్యటించారు. అనంతరం రాష్ట్రంలో వరదలపై హనుమకొండ కలెక్టరేట్‌లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ తుపాను ప్రభావంతో తెలంగాణలోని 12 జిల్లా్ల్లో తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. పంట నష్టం, ఆస్తి నష్టం, దెబ్బతిన్న రూడ్లపై నివేదికలు తెప్పించాలని.. ప్రజా ప్రతినిధుల వద్దకు వచ్చిన నివేదికలను కలెక్టర్లకు పంపాలని ఆదేశించారు.

1/11

మొంథా తుపాను కారణంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలని పలు ప్రాంతాలు నీటిలో చిక్కుకుపోయాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హనుమకొండలో పర్యటించారు.

2/11

అనంతరం రాష్ట్రంలో వరదలపై హనుమకొండ కలెక్టరేట్‌లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.

3/11

ఈ తుపాను ప్రభావంతో తెలంగాణలోని 12 జిల్లా్ల్లో తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. పంట నష్టం, ఆస్తి నష్టం, దెబ్బతిన్న రూడ్లపై నివేదికలు తెప్పించాలని.. ప్రజా ప్రతినిధుల వద్దకు వచ్చిన నివేదికలను కలెక్టర్లకు పంపాలని ఆదేశించారు.

4/11

అన్ని నివేదికలు సమీకరించి నిర్ణీత విధానంలో కేంద్రానికి నివేదించాల్సి ఉంటుందన్నారు. ఇక తుపాను నష్టాలపై కేంద్ర నిధులు రాబట్టుకోవాల్సి ఉందని తెలిపారు. ఈ విషయంలో అలసత్వం ప్రదర్శించ వద్దని అధికారులకు సూచించారు.

5/11

నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని హచ్చరించారు. ధనిక రాష్ట్రమని కేంద్రం నుంచి రావాల్సిన నిధులు వదులకున ప్రసక్తే లేదన్నారు.

6/11

ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలకు అందించాల్సిన ఆర్థిక సాయంపై గతంలో ఇచ్చిన జీవో ప్రకారం.. తాజా వరదల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

7/11

ఇళ్లు మునిగిన వారికి రూ. 15 వేల చెప్పున నష్టపరిహారం చెల్లించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.

8/11

గుడిసెలు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఎకరా పంట నష్టానికి రూ. 10 వేలు చెప్పున అందించనున్నారు.

9/11

అలాగే ఆవులు, గేదెలు మృత్యువాత పడితే రూ. 50 వేలు, మేకలు, గొర్రెలకు రూ. 5 వేు చెల్లించేందుకు చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు.

10/11

ఈ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ వెంట జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసులు రెడ్డి, జిల్లాకు చెందిన మంత్రి కొండా సురేఖతోపాటు పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఉన్నారు.

11/11

ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా భారీ భద్రత ఏర్పాటు చేశారు.ఈ పర్యటనలో బాధితులతో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా మాట్లాడారు. ఈ సందర్భంగా వారికి భరోసా ఇచ్చారు.

Updated Date - Oct 31 , 2025 | 08:52 PM