ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

TG GOVT: తెలంగాణకు మరో దిగ్గజ సంస్థ..

ABN, Publish Date - Apr 18 , 2025 | 07:24 AM

తెలంగాణలో పెట్టుబడులే లక్ష్యంగా జపాన్‌‌లో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్‌ బృందం పర్యటిస్తుంది. గురువారం నాడు మారుబెనీ కంపెనీతో కీలకమైన పెట్టుబడుల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.

1/13

తెలంగాణలో పెట్టుబడులే లక్ష్యంగా జపాన్‌‌లో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్‌ బృందం పర్యటిస్తుంది. హైదరాబాద్‌లో కొత్తగా అభివృద్ధి చేస్తున్న ఫ్యూచర్ సిటీకి మారుబేని కంపెనీకి సీఎం రేవంత్‌రెడ్డి స్వాగతం పలికారు.

2/13

సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిపాదనలతో జపాన్‌కు చెందిన దిగ్గజ కంపెనీ మారుబెనీ తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చింది.

3/13

రూ.1000 కోట్ల ప్రారంభ పెట్టుబడితో ఫ్యూచర్‌ సిటీలో ‘నెక్ట్స్‌ జనరేషన్‌ ఇండస్ట్రీయల్‌ పార్కు’ను ఏర్పాటు చేయడానికి మారుబెనీ కంపెనీ ప్రతినిధులు సంసిద్ధత వ్యక్తం చేశారు.

4/13

జపాన్‌ పర్యటనలో బిజీగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్‌ బృందం తొలిరోజైన గురువారం కీలకమైన పెట్టుబడుల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.

5/13

తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు జపాన్‌కు చెందిన వ్యాపార దిగ్గజం మారుబెనీ కంపెనీ అంగీకరించింది.

6/13

అలాగే.. జపాన్‌లో సోనీ ప్రధాన కార్యాలయాన్ని ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి బృందం సందర్శించింది.

7/13

సోనీ ప్రధాన కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో ఫొటో దిగుతున్న ఆ కంపెనీ ప్రతినిధులు

8/13

సోనీ కంపెనీకి చెందిన యానిమేషన్ అనుబంధ సంస్థ బృందంతో రేవంత్​ రెడ్డి భేటీ అయ్యారు.

9/13

సోనీ కార్పొరేషన్ తయారు చేస్తున్న కొత్త ఉత్పత్తులు, చేపడుతున్న కొత్త కార్యక్రమాలను ఆ కంపెనీ ప్రతినిధులు ప్రదర్శించారు.

10/13

ఉత్పత్తులతో పాటు వారి పని తీరును ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డికి సోనీ కంపెనీ బృందం వివరించింది.

11/13

ఈ సందర్భంగా సోనీ కంపెనీ యానిమేషన్ అనుబంధ సంస్థతో ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి వివరణాత్మక చర్చలు జరిపారు. యానిమేషన్, వీఎఫ్ఐ, గేమింగ్ రంగాల్లో హైదరాబాద్‌లో ఉన్న అవకాశాలు, అనుకూలతలను వివరించారు.

12/13

అలాగే టోక్యో మెట్రోను ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం సందర్శించింది.

13/13

టోక్యో మెట్రో కార్యాచరణ, సామర్థ్యాన్ని రేవంత్​ రెడ్డి నేతృత్వంలోని బృందం సమీక్షించింది

Updated Date - Apr 18 , 2025 | 07:53 AM