CM Revanth Meets Vidushekhara Bharati Swamiji: శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీస్వామిని కలిసిన సీఎం రేవంత్
ABN, Publish Date - Oct 28 , 2025 | 01:57 PM
శృంగేరి జగద్గురువులు శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీస్వామిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. హైదరాబాద్ నల్లకుంట శంకర్‌మఠంకు చేరుకున్న సీఎం.. అక్కడ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విధుశేఖర భారతీస్వామిని కలిసి.. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ మాట్లాడారు.
హైదరాబాద్‌లోని నల్లకుంట శంకర్‌మఠంను సందర్శించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
ఆలయంలో సీఎం ప్రత్యేక పూజలు చేసి స్వామి వారి ఆశీస్సులు పొందారు.
శృంగేరి జగద్గురువులు శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీస్వామిని రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.
‘ధర్మ విజయ యాత్ర’లో భాగంగా శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీస్వామి హైదరాబాద్‌కు విచ్చేశారు.
శంకర్‌మఠంలో భారతీస్వామిని కలిసిన సీఎం.
వేములవాడ ఆలయ అభివృద్ధి వివరాలను భారతీస్వామికి ముఖ్యమంత్రి వివరించారు.
సీఎం రేవంత్‌తో పాటు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Updated Date - Oct 28 , 2025 | 02:01 PM