గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ
ABN, Publish Date - May 13 , 2025 | 06:49 AM
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాజ్‌భవన్‌లో సోమవారం నాడు భేటీ అయ్యారు. భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు, దేశంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో గవర్నర్‌తో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పరిస్థితులు, శాంతిభద్రతల గురించి గవర్నర్‌కు ముఖ్యమంత్రి వివరించారు. ఈ సమావేశంలో పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాజ్‌భవన్‌లో సోమవారం నాడు భేటీ అయ్యారు.
ఈసమావేశంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో పలు కీలక అంశాలపై సీఎం రేవంత్‌రెడ్డి చర్చించారు.
గవర్నర్‌కు పూల బొకే అందజేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి
సుమారు 20 నిమిషాలపాటు ఈ సమావేశం జరిగింది.
జాతీయ స్థాయి అంశాలు, రాష్ట్రంలో పరిస్థితులు, ఇతర కీలక అంశాలపై గవర్నర్‌తో ముఖ్యమంత్రి చర్చించారు.
కాగా ప్రపంచ సుందరీమణులకు ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రభుత్వం తరపున ఇచ్చే విందులో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను పాల్గొనాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆహ్వానించారు.
అలాగే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు హాజరుకావాలని కూడా గవర్నర్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ఆహ్వానం పలికారు.
Updated Date - May 13 , 2025 | 07:22 AM