Mahabubnagar: పెరిగిన చలి తీవ్రత.. గజగజ వణుకుతున్న ప్రజలు
ABN, Publish Date - Nov 18 , 2025 | 09:18 PM
మరికొన్ని రోజుల్లో కార్తీకం వెళ్లిపోతుంది. మార్గశిరం వచ్చేస్తోంది. చలి తీవ్రత మాత్రం రోజురోజుకు పెరుగుతోంది. రాత్రి పొద్దు ఎక్కవగా ఉంటుంది. సూర్యోదయం తర్వాత కూడా చలి చంపేస్తోంది. సూర్యాస్తమయం అనంతరం చలి..గిలి పుట్టిస్తోంది. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో చలి తీవ్రత కారణంగా చలిమంటలు వేసుకుంటున్నారు.
మరికొన్ని రోజుల్లో కార్తీకం వెళ్లిపోతుంది. మార్గశిరం వచ్చేస్తోంది. చలి తీవ్రత మాత్రం రోజురోజుకు పెరుగుతోంది. రాత్రి పొద్దు ఎక్కవగా ఉంటుంది.
సూర్యోదయం తర్వాత కూడా చలి చంపేస్తోంది.
సూర్యాస్తమయం అనంతరం చలి..గిలి పుట్టిస్తోంది.
సాయంత్రం వేళ నుంచి చలి తీవ్రత మరింత పెరుగుతోంది. దాంతో రాత్రి 8, 9 గంటలకే పల్లెల నుంచి నగరాల్లోని రహదారులు నిర్మానుష్యంగా మారుతోన్నాయి.
పిల్లా పాపాలతో బయటకు వెళ్లే వారు.. చలి నుంచి రక్షణ కోసం ఉన్ని దుస్తులు ధరించి వెళ్తున్నారు.
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో చలి తీవ్రత కారణంగా చలిమంటలు వేసుకుంటున్నారు.
చలి తీవ్రత పెరగడంతో.. ప్రజలంతా ఇళ్లకే పరిమితమవుతున్నారు.
అత్యవసరమైతే తప్పా.. ఏదైన పని మీద బయటకు వస్తే మాత్రం.. ఉన్ని దుస్తులు ధరించి వస్తున్నారు.
Updated Date - Nov 18 , 2025 | 09:19 PM