KCR Bform to Maganti Sunitha: మాగంటి సునీతకు బీఫాం ఇచ్చిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
ABN, Publish Date - Oct 14 , 2025 | 07:49 PM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇవాళ(మంగళవారం) బీఫాం అందజేశారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇవాళ(మంగళవారం) బీఫాం అందజేశారు.
అలాగే, ఎన్నికల ఖర్చు నిమిత్తం రూ.40లక్షల చెక్కును అందజేశారు గులాబీ బాస్.
ఈరోజు ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫాంహౌస్‌లో మాగంటి సునీత కుటుంబ సభ్యులతో వెళ్లి కలిశారు.
అనంతరం గులాబీ బాస్‌తో పలు కీలక అంశాలపై చర్చించారు మాగంటి సునీత.
అయితే, రేపు(బుధవారం) సాదాసీదాగా నామినేషన్ దాఖలు చేయనున్నారు మాగంటి సునీత. ఈనెల 19వ తేదీన భారీ ర్యాలీతో రెండో సెట్ నామినేషన్ వేయనున్నారు మాగంటి సునీత.
ఈ సందర్భంగా సునీత గెలవాలని ఆకాంక్షించారు కేసీఆర్. బీజేపీ శ్రేణులు కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు కేసీఆర్.
Updated Date - Oct 14 , 2025 | 08:04 PM