ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఢిల్లీ స్వాతంత్య్ర వేడుకల్లో స్పెషల్ మూమెంట్స్..

ABN, Publish Date - Aug 16 , 2025 | 04:26 PM

దేశరాజధాని ఢిల్లీలోని ఎర్రకోటలో 79వ స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. దేశనలుమూలల నుంచి 5 వేల మంది అతిథులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. జవాన్ల కవాతులు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను అలరించాయి. ఈ వేడుకల్లో కొన్ని హైలెట్ ఫొటోలు మీకోసం..

1/7

ఎప్పటిలాగే ఈ ఏడాది దేశరాజధాని ఢిల్లీలో స్వాతంత్య్ర వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఎర్రకోట బురుజు నుంచి ప్రధానమంత్రి నరేంద్రమోదీ 103 నిమిషాల పాటు ఏకధాటిగా ప్రసంగించి తన రికార్డును తానే బద్ధలు కొట్టారు. గతేడాది 98 నిమిషాల పాటు ప్రసంగించారు.

2/7

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఈ సారి 5 వేల మంది ప్రత్యేక అతిథులు హాజరయ్యారు. దేశనలుమూల నుంచి ఎంపిక చేసిన దేశం నలుమూలల నుంచి ఎంపిక చేసిన అంగన్‌వాడీలు, లఖ్‌పతీ దీదీలు, సర్పంచులు, జాతీయ బీ కీపింగ్‌ అండ్‌ హనీ మిషన్‌ నుంచి గుర్తింపు పొందిన రైతులు, ఔషధ మొక్కల పెంపకంలో ఆరితేరిన వారు, సహకార సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

3/7

ఉత్తరప్రదేశ్ కు చెందిన కళాకారుల సాంస్కృతిక ప్రదర్శన స్వాతంత్య్ర వేడుకల్లో హైలెట్ గా నిలిచింది.

4/7

భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో జమ్మూ కశ్మీర్ కు చెందిన బ్యాగ్‌పైపర్లు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు.

5/7

79వ స్వాతంత్య్ర వేడుకల్లో అద్భుత రీతిలో కవాతు చేసి నారీశక్తిని చాటారు శ్రీనగర్ మహిళా పోలీసులు

6/7

లక్నోకు చెందిన యువ కళాకారుల బృందం సాంస్కృతిక ప్రదర్శన కన్నులపండువగా సాగింది.

7/7

భారత పారామిలిటరీ సైనిక బలగాలు చేసిన కవాతు వీక్షకులను అమితంగా ఆకట్టుకుంది.

Updated Date - Aug 16 , 2025 | 04:26 PM