Mallikarjun Kharge: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇంట్లో ఇండి కూటమి నేతల సమావేశం
ABN, Publish Date - Dec 01 , 2025 | 02:09 PM
కాంగ్రెస్ రాజ్యసభ ఫ్లోర్ లీడర్ మల్లికార్జున ఖర్గే కార్యాలయంలో ఇండి కూటమి నేతల సమావేశం జరిగింది. సమావేశానికి హాజరైన రాహుల్ గాంధీ, సినీ నటుడు, రాజ్యసభ సభ్యుడు కమల్ హాసన్ వంటి పలువురు ఇండి కూటమి నేతలు హాజరయ్యారు.
ఇవాళ(సోమవారం)కాంగ్రెస్ రాజ్యసభ ఫ్లోర్ లీడర్ మల్లికార్జున ఖర్గే కార్యాలయంలో ఇండి కూటమి నేతల సమావేశం జరిగింది.
ఈ సమావేశానికి కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ, సినీ నటుడు, రాజ్యసభ సభ్యుడు కమల్ హాసన్ వంటి పలువురు ఇండి కూటమి నేతలు హాజరయ్యారు
పార్లమెంట్ సమావేశాల్లో వ్యవహరించాల్సిన వ్యూహంపై కూటమి నేతలు సుదీర్ఘంగా చర్చించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) లాంటి అంశాలు ప్రస్తావనకు వచ్చాయి.
అలానే పార్లమెంట్ శీతాకాల సమావేశాల ప్రారంభానికి ముందు ప్రధాని మోదీపై మల్లికార్జున ఖర్గే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
దేశం ఎదుర్కొంటున్న కీలక సమస్యలపై చర్చ జరపకుండా, ప్రధాని మరోసారి 'నాటకానికి' తెరలేపారని ఆయన ఘాటుగా విమర్శించారు.
పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి ముందు ప్రధాని చేసిన ప్రసంగాన్ని ఉద్దేశించి ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు.
Updated Date - Dec 01 , 2025 | 02:19 PM