NTR District: పోలి పాడ్యమి.. పవిత్ర సంగమానికి పోటెత్తిన భక్తులు..
ABN, Publish Date - Nov 21 , 2025 | 10:31 AM
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద ఉన్న పవిత్ర సంగమం కృష్ణా తీరానికి పోలి పాడ్యమి సందర్భంగా భక్తులు పోటెత్తారు. శుక్రవారం తెల్లవారుజామున వేలాది మంది మహిళలు కృష్ణానది వద్దకు చేరుకున్నారు. అనంతరం ఆవు నెయ్యితో దీపారాధన చేసి.. అరటి డోప్పలలో పెట్టి నదిలోకి వదిలారు. అందుకోసం తెల్లవారుజామున మహిళలంతా నిద్ర లేచి.. తలస్నానం ఆచరించి శుభ్రమైన దుస్తులు ధరించి కృష్ణా తీరానికి చేరుకున్నారు.

దీంతో పవిత్ర సంగమ ప్రాంతం దీపాల వెలుగుల్లో సరికొత్త శోభను సంతరించుకుంది.
ఎన్టీఆర్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పవిత్ర సంగమ ప్రాంతానికి భక్తులు భారీగా తరలి వచ్చారు. కార్తీక అమావాస్య తర్వాత వచ్చే పాడ్యమిని పోలి పాడ్యమి అంటారు.
ఈ రోజు.. ఎన్నో మహిమలు కలిగిన పర్వదినంగా భావిస్తారు. ఈ రోజున నదులు, చెరువుల్లో దీపం వదలడం వల్ల ఎంతో పుణ్యం వస్తుందని పెద్దలు చెబుతారు.
ఇలా దీప జ్యోతి ద్వారా మన కర్మలన్నీ శుద్ధి చెందుతాయని అంటారు. ఈ రోజు పోలి కథ విన్నా.. చదివినా సకల సౌభాగ్యాలు కలుగుతాయని మన పురాణాలు సైతం స్పష్టం చేస్తున్నాయి.
ముఖ్యంగా లక్ష్మీ కటాక్షం కోసం ఎదురు చూసే వారికి ఈ రోజు అత్యంత శుభప్రదం. ఈ రోజు పోలి కథ చదివి.. నియమాలు పాటిస్తే.. ముక్తి సైతం లభిస్తోందని పెద్దలు విశ్వసిస్తారు.
Updated Date - Nov 21 , 2025 | 10:32 AM