Batukamma Celebrations: బతుకమ్మ సంబురాలకి వేళాయె..
ABN, Publish Date - Sep 21 , 2025 | 08:35 AM
బతుకమ్మ సంబురాలకు వేళైంది. మహాలయ అమావాస్య సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ ఆటాపాటలే కనిపించనున్నాయి.
బతుకమ్మ సంబురాలకు వేళైంది. మహాలయ అమావాస్య సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేటి(ఆదివారం) నుంచి పల్లె పల్లెలో.. వాడ వాడలా తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ ఆటాపాటలే కనిపించనున్నాయి.
సకల జనులు, సబ్బండ వర్ణాలు కలిసి ఏకత్వస్ఫూర్తిని చాటేలా బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది.
పూలను పూజిస్తూ.. ప్రకృతిని ఆరాధిస్తూ మహిళలు అత్యంత వైభవంగా నిర్వహించుకునే గొప్ప పండుగ బతుకమ్మ.
తెలంగాణ సంస్కృతి సంప్రదాయలకు ఆడపడుచుల ఔన్నత్యానికి ప్రతీకైన బతుకమ్మ పండుగను ఆడపడుచులందరూ కలిసి సంతోషంగా జరుపుకుంటారు.
తెలంగాణ సామూహిక జీవన విధానానికి, కష్టసుఖాలను కలిసి పంచుకునే ప్రజల ఐక్యతకు ఈ పండుగ నిదర్శనం అన్నారు.
ఎంగిలిపూల నుంచి సద్దుల వరకూ తొమ్మిది రోజులు బతుకమ్మ ఆటపాటలతో అందరూ వైభవంగా ఈ పండుగను జరుపుకుంటారు.
Updated Date - Sep 21 , 2025 | 08:38 AM