ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో పాల్గొన్న మంత్రి అచ్చెన్నాయుడు..
ABN, Publish Date - Aug 09 , 2025 | 08:53 PM
శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొన్నారు.
అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిజనులకు శుభాకాంక్షలు చెప్పారు.
ఆదివాసీల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం,గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చిత్తశుద్ధితో పనిచేస్తుందని ఆయన హామీ ఇచ్చారు.
ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని పాతపట్నం నియోజకవర్గంలో నిర్వహించిన కార్యక్రమానికి గిరిజనులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు మామిడి గోవిందరావు,నరసన్నపేట శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి, జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ పుండ్కర్,ఆర్డీవో కృష్ణ మూర్తి తదితరులు పాల్గొన్నారు.
కార్యక్రమం సందర్భంగా గిరిజనులు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను మంత్రి అచ్చెన్నాయుడు సందర్శించారు.
సాంప్రదాయ గిరిజన వస్త్రధారణలో కార్యక్రమానికి హాజరైన యువతి, బాలిక
Updated Date - Aug 09 , 2025 | 08:54 PM