విజయవాడ ఏపీ సీఐడీ రీజనల్ ఆఫీస్‌కి విచారణ నిమిత్తం హాజరైన విజయసాయి రెడ్డి
ABN, Publish Date - Mar 12 , 2025 | 01:21 PM
విజయవాడ ఏపీ సీఐడీ రీజనల్ ఆఫీస్ కి విచారణ నిమిత్తం హాజరైన విజయసాయి రెడ్డి
కాకినాడ పోర్ట్ వాటాల బదిలీ కేసులో ఏపీ సీఐడీ అధికారులు రెండు రోజుల క్రితం మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి కి నోటీసులు ఇచ్చారు
బుధవారం ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు
ఆయన ఈరోజు విజయవాడ సిఐడీ రీజనల్ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు
కాకినాడ పోర్టులో వాటాను బలవంతంగా రాయించుకున్న వ్యవహారంపై విజయసాయిపై కేసు నమోదు చేశారు
అప్పుడు వాటాల్లో పాత్రధారులు, సూత్రధారులపై విజయసాయి రెడ్డిని సీఐడీ అధికారులు ప్రశ్నించనున్నారు
ఇటీవల వైసీపీకి, రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయి రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే
Updated Date - Mar 12 , 2025 | 01:21 PM