Udan Yatri Cafe: విజయవాడ విమానాశ్రయంలో ఉడాన్ యాత్రీ కేఫ్ ప్రారంభం
ABN, Publish Date - Sep 30 , 2025 | 10:50 AM
కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఉడాన్ యాత్రీ కేఫ్‌ను సోమవారం విజయవాడ విమానాశ్రయంలో ప్రారంభించారు. ఫుడ్, బేవరేజ్‌లను పలువురికి అందజేశారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడారు.
కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఉడాన్ యాత్రీ కేఫ్‌ను సోమవారం విజయవాడ విమానాశ్రయంలో ఘనంగా ప్రారంభించారు.
ఫుడ్, బేవరేజ్‌లను పలువురికి అందజేశారు.
జ్యోతి ప్రజ్వలన చేసి ఉడాన్ యాత్రీ కేఫ్‌ను ప్రారంభిస్తున్న కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు
రామ్మోహన్ నాయుడుతో ఫొటో దిగుతున్న మహిళ
ఈ కార్యక్రమంలో విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్, ఏఏఐ అధికారులు, విమానాశ్రయ సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడారు. ఫుడ్, బేవరేజ్‌లు కేవలం రూ.10ల నుంచి అందుబాటులో ఉంచడం ద్వారా ప్రతి ప్రయాణికుడికి అదనపు సౌకర్యాన్ని చేరువ చేశామని వ్యాఖ్యానించారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆలోచన.. అందరికీ అందుబాటులో, సునిశితమైన విమాన ప్రయాణం ఆవిష్కరణలో మరో బలమైన అడుగు వేశామని పేర్కొన్నారు రామ్మోహన్ నాయుడు.
ప్రయాణికులతో మాట్లాడి, వారి సానుకూల అభిప్రాయాలను తీసుకున్నామని చెప్పుకొచ్చారు రామ్మోహన్ నాయుడు.
దేశంలోని ప్రతీ విమానాశ్రయంలో ఉడాన్ యాత్రీ కేఫ్‌లను ఏర్పాటు చేయాలనే బృహత్తర లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ప్రతీ ప్రయాణికుడికి సరసమైన సేవలను చేరువ చేయాలనే నిబద్ధతను విస్తృతపరుస్తున్నామని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.
అలాగే 'ఏక్ పేడ్ మా కె నామ్ సే ' కార్యక్రమం కింద విమానాశ్రయం ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమంలో కూడా తాను పాల్గొన్నానని వెల్లడించారు రామ్మోహన్ నాయుడు.
Updated Date - Sep 30 , 2025 | 10:52 AM