ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Yuvagalam Padayatra : యువగళానికి రెండేళ్లు.. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో సంబురాలు

ABN, Publish Date - Jan 27 , 2025 | 05:28 PM

జగన్మోహన్‌రెడ్డి అరాచక పాలనపై ప్రజలను చైతన్యం చేస్తూ, యువగళం పేరుతో నారా లోకేష్ చేపట్టిన పాదయాత్రకు ఇవాళ(సోమవారం) రెండేళ్లు పూర్తి అయ్యాయి. ఈ వేడుకలను టీడీపీ కార్యాలయాల్లో ఆ పార్టీ నేతలు ఘనంగా చేసుకుంటున్నారు. కేకు కట్ చేసి తినిపించుకుంటున్నారు. ఈ సందర్భంగా నారా లోకేష్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

1/8

వైసీపీ అరాచక పాలనపై సమరశంఖం పూరించిన లోకేశ్‌ పాదయాత్ర చేపట్టి సోమవారంతో రెండేళ్లు ముగిశాయి.

2/8

ఏపీలోని 11 ఉమ్మడి జిల్లాలు, 97 నియోజకవర్గాలు, 2,097 గ్రామాల మీదుగా 226 రోజుల పాటు 3132 కిలోమీటర్లు యువగళం పాదయాత్ర సాగింది.

3/8

యువగళం ప్రారంభమై రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్‌లో ఘనంగా వేడుకలు నిర్వహించారు.

4/8

మంగళగిరి టీడీపీ కార్యాలయంలో కేకు కట్ చేసి నాయకులు తినిపించుకున్నారు.

5/8

టీడీపీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ నాదెండ్ల బ్రహ్మం ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి టపాసులు కాల్చారు.

6/8

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, జీవీ రెడ్డి, అశోక్ బాబు తదితర నేతలు పాల్గొన్నారు.

7/8

ఈ సందర్భంగా నాదెండ్ల బ్రహ్మం యువగళం పాదయాత్రకు సంబంధిచిన పలు కీలక విషయాలను నేతలతో గుర్తుచేసుకున్నారు.

8/8

నారా లోకేష్‌ రెడ్ బుక్‌ను చూస్తే వైసీపీ నేతల వెన్నులో వణుకు పుడుతుందని నేతలు అన్నారు.

Updated Date - Jan 27 , 2025 | 05:40 PM