తిరుమలలో జోరు వర్షం.. భక్తుల తీవ్ర ఇబ్బందులు
ABN, Publish Date - Nov 30 , 2025 | 07:51 PM
దిత్వా తుపాను ప్రభావంతో తిరుమలలో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎడతెరిపిలేని వర్షం కురుస్తుండటంతో అవస్థలు పడుతున్నారు.
దిత్వా తుపాను ప్రభావంతో తిరుమలలో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎడతెరిపి లేని వర్షం కురుస్తుండటంతో అవస్థలు పడుతున్నారు.
తిరుమలలో భారీ వర్షాలు కురుస్తున్నా, చలిని సైతం లెక్కచేయకుండా భక్తులు స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు.
శ్రీవారి సర్వదర్శనం కోసం సమయం ఎక్కువ పడుతుందని భక్తులు కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు.
దిత్వా తుపాను ప్రభావంతో వర్షాలు, చల్లని వాతావరణం ఉన్నప్పటికీ భక్తులు ఏ మాత్రం వెనకడుగు వేయకుండా తమ భక్తిని చాటుకుంటున్నారు.
గోవింద నామస్మరణతో శ్రీవారి ఆలయం మారుమోగుతుంది.
రద్దీకి అనుగుణంగా టీటీడీ అధికారులు భక్తులకు తగిన ఏర్పాట్లు చేశారు.
Updated Date - Nov 30 , 2025 | 07:55 PM