ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సింగపూర్‌లో సీఎం చంద్రబాబుకు ఘనంగా వీడ్కోలు

ABN, Publish Date - Jul 30 , 2025 | 08:32 PM

నాలుగు రోజుల పర్యటన ముగించుకుని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతికి బయలుదేరారు. ఈ సందర్భంగా ఆయనకు స్థానిక ఎన్నారైలు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు 26 సమావేశాలు నిర్వహించారు. అలాగే సింగపూర్ దేశాధ్యక్షుడితో భేటీ అయ్యారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను సింగపూర్ పారిశ్రామికవేత్తలు, వివిధ కంపెనీ సీఈఓలకు వివరించారు.

1/4

నాలుగు రోజుల పర్యటన పూర్తి చేసుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం సింగపూర్ నుంచి అమరావతికి బయలుదేరారు. అంతకుముందు సింగపూర్‌లో ఆయన బస చేసిన హోటల్‌కు తెలుగు ఎన్నారైలు భారీ సంఖ్యలో చేరుకున్నారు.

2/4

ఈ సందర్భంగా హోటల్ బయట సీఎం చంద్రబాబుతో వారు సెల్ఫీలు తీసుకున్నారు. ఆయన ఆటోగ్రాఫ్‌ తీసుకున్నారు. జై సీబీఎన్ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు.

3/4

ఈ సందర్భంగా పలువురిని ఆయన భుజం తట్టి స్వయంగా పలకరించారు. ఆయనకు షేక్ హ్యాండ్‌ ఇచ్చేందుకు పలువురు పోటీ పడ్డారు.

4/4

అలాగే హోటల్ సిబ్బంది సైతం సీఎం చంద్రబాబుతో సెల్ఫీ దిగేందుకు పోటీ పడ్డారు. సీఎం చంద్రబాబుకు తెలుగు ఎన్నారైలు ఘనంగా వీడ్కోలు పలికారు.

Updated Date - Jul 30 , 2025 | 09:17 PM