బీచ్ ఫెస్టివల్‌ను ప్రారంభించిన కేంద్ర మంత్రి
ABN, Publish Date - Apr 20 , 2025 | 07:24 AM
శ్రీకాకుళం జిల్లా, సోంపేట మండలం, బారువ తీరంలో బీచ్ ఫెస్టివల్ శనివారం సందడిగా సాగింది. అధిక సంఖ్యలో ప్రజలు తరలిరావడంతో బారువ తీరం జనసంద్రంగా మారింది. కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు ముఖ్య అతిథిగా హాజరై బీచ్ ఫెస్టివల్‌ను ప్రారంభించారు. వేడుకల్లో భాగంగా కబడ్డీ, వాలీబాల్, పడవ పోటీలను నిర్వహించారు. బోటు షికారులో విహరించారు. గాలిపటాలు ఎగరేశారు. సముద్రంలో అపాయం ఎదురైతే.. ఎలా రక్షించాలో డెమో ద్వారా వివరించారు.
శ్రీకాకుళం జిల్లా, సోంపేట మండలం, బారువ తీరంలో బీచ్ ఫెస్టివల్‌ను ప్రారంభించిన కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు..
సముద్రంలో బోట్ షికారు చేస్తున్న కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, అధికారులు..
బారువ సముద్ర తీరంలో వాలీబాల్ పోటీలను ప్రారంభించిన రామ్మోహన్ నాయుడు..
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు బీచ్ తీరంలో సైకత శిల్పం తాంబేలును తిలకిస్తున్న దృశ్యం..
బారువ బీచ్ తీరంలో కబాడ్డీ పోటీలు..
బీచ్ ఫెస్టివల్‌కు పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన జనం..
సముద్రంలో అపాయం ఎదురైతే.. ఎలా రక్షించాలో డెమో ద్వారా వివరించారు.
బారువ బీచ్ తీరంలో సాంస్కృతిక కార్యక్రమాలు..
బీచ్ తీరంలో ఉత్సాహంగా సందడి చేస్తున్న యువత
Updated Date - Apr 20 , 2025 | 07:24 AM