Tirupati Pedda Sesha Vahanam: పెద్దశేష వాహనంపై పరమపద నాధుడు అలంకారంలో సిరులతల్లి
ABN, Publish Date - Nov 18 , 2025 | 01:11 PM
పెద్దశేషవాహనంపై పరమపద వైకుంఠనాథుని అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 8 నుండి 10 గంటల వరకు వాహనసేవ సాగింది. పలువురు అర్చకులు, ఇతర అధికారులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
పెద్దశేష వాహనంపై పరమపద నాధుడు అలంకారంలో సిరులతల్లి
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు రెండవ రోజు ఘనంగా జరుగుతున్నాయి
ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దివ్య దర్శనమిచ్చిన అమ్మవారు
వాహన సేవల్లో పలువురు అర్చకులు, ఇతర అధికారుల తోపాటు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు
వాహనసేవ ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో అమ్మవారి ఉత్సవం కోలాహలంగా జరిగింది
భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు.
సంస్కృత కార్యక్రమాలతో సందడి చేసిన విద్యార్థులు
Updated Date - Nov 18 , 2025 | 01:11 PM