Sri Sathya Sai Baba: ఘనంగా పుట్టపర్తి సత్యసాయి శతజయంతి వేడుకలు
ABN, Publish Date - Nov 23 , 2025 | 04:09 PM
శ్రీ సత్యసాయి జిల్లాలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుక సందర్భంగా పుట్టపర్తి పట్టణం ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోతోంది.
శ్రీ సత్యసాయి జిల్లాలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి.
ఈ ఉత్సవాలకు ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, త్రిపుర గవర్నర్ ఇంద్రసేన, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి హాజరయ్యారు.
సత్యసాయి సమాధిని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సాయి బాబా గురించి ప్రసంగించారు.
'మానవ సేవే మాధవ సేవ' అనే సూత్రాన్ని ఆచరణలో చూపి ప్రభుత్వాలతో పోటీపడి ప్రజలకు ఉచిత విద్య, వైద్య సేవలు అందించిన మహనీయుడు శ్రీ సత్యసాయి బాబా అని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు.
ఈ వేడుక సందర్భంగా పుట్టపర్తి పట్టణం ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోతోంది. దేశ విదేశాల నుంచి వేలాది మంది సాయి బాబా భక్తులు ఈ ఉత్సవాలను దర్శించుకోవడానికి వచ్చారు.
Updated Date - Nov 23 , 2025 | 04:09 PM