పుట్టపర్తి సాయిబాబాతో ఉన్న జ్ఞాపకాలను పంచుకున్న ప్రధాని మోదీ
ABN, Publish Date - Nov 19 , 2025 | 11:02 AM
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పుట్టపర్తిలో పర్యటిస్తున్నారు. శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలలో మోదీ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా బాబా జయంతి ఉత్సవాల్లో పాల్గొనడంపై ప్రధాని ఎక్స్ వేదికగా స్పందించారు. శ్రీ సత్యసాయి అనుభూతులలో కొన్ని క్షణాలు అంటూ ట్వీట్ చేశారు.
శ్రీసత్యసాయి జయంతి ఉత్సవాలలో పాల్గొనేందుకు పుట్టపర్తికి విచ్చేసిన ప్రధాని మోదీ.
సత్యసాయి బాబాతో వివిధ సందర్భాల్లో కలుసుకున్న ఫోటోలను ఎక్స్ వేదికగా ప్రధాని పంచుకున్నారు.
పుట్టపర్తిలో జరగబోయే శ్రీ సత్యసాయి బాబా జన్మ శతాబ్ది ఉత్సవాలకు హాజరవడానికి ఎదురుచూస్తున్నాను.
సత్యసాయి బాబా జీవితం, సమాజ సేవ పట్ల అచంచల నిబద్ధత, ఆధ్యాత్మిక విలువల ద్వారా సమాజానికి మార్గదర్శకత్వం అందించిన తీరు తరతరాలకు ప్రేరణగా నిలుస్తూనే ఉంది.
బాబా మాటలు, ఉపదేశాలు, మానవతా సందేశాలు ఎల్లప్పుడూ నా మనసులో వెలుగునింపాయి అంటూ ప్రధాని ట్వీట్ చేశారు.
Updated Date - Nov 19 , 2025 | 11:33 AM