ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Pawan Kalyan: వృద్ధురాలి ప్రేమకు ముగ్ధులైన పవన్ కల్యాణ్

ABN, Publish Date - May 10 , 2025 | 11:19 AM

గత సార్వత్రిక ఎన్నికల్లో తన గెలుపు కోసం వేగులమ్మ అమ్మవారికి మొక్కుకుని, తన పింఛను సొమ్ముతో ఆ మొక్కు చెల్లించిన 96 ఏళ్ల వృద్ధురాలు పోతుల పేరంటాలుకి ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పాదాభివందనం చేశారు. ఆమెను గుండెలకు హత్తుకుని.. స్వయంగా భోజనం వడ్డించారు.

1/12

గత సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కల్యాణ్ విజయాన్ని కాంక్షిస్తూ గ్రామదేవత వేగులమ్మ అమ్మవారికి పిఠాపురం నియోజకవర్గం యు.కొత్తపల్లి మండలం కొత్త ఇసుకపల్లికి చెందిన 96 ఏళ్ల వృద్ధురాలు పోతుల పేరంటాలు మొక్కులు మొక్కారు.

2/12

దీనికోసం నెలనెలా తనకు వచ్చే పింఛను సొమ్ములో కొంత దాచి రూ.27 వేలతో అమ్మవారికి గరగ చేయించి పోతుల పేరంటాలు మొక్కు చెల్లించుకున్నారు.

3/12

ఒంటరి జీవితం గడుపుతూ సొంత ఇల్లు కూడా లేని ఆ అవ్వ గురించి తెలుసుకుని.. ఆమెను మంగళగిరిలోని జనసేన కార్యాలయానికి తీసుకురావాలని అనుచరులను ఆదేశించారు.

4/12

ఈ విషయం తెలుసుకున్న పవన్ కల్యాణ్ పేరంటాలని శుక్రవారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయానికి పిలిపించుకొని ఆమెతో ముచ్చటించారు.

5/12

తనపై చూపిన మమకారానికి పవన్ కల్యాణ్ ముగ్దులయ్యారు.

6/12

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తనపై చూపిన ప్రేమకు ఆ వృద్ధురాలు ఆనందంతో పొంగిపోయింది.

7/12

శుక్రవారం మంగళగిరికి వచ్చిన ఆమెను చూసి పవన్‌‌కల్యాణ్ భావోద్వేగానికి గురయ్యారు. తనతో కలిసి భోజనం చేయాలనే అవ్వ కోరికను పవన్‌‌కల్యాణ్ నెరవేర్చారు.

8/12

అవ్వను ఆత్మీయంగా పలుకరిస్తూ స్వయంగా పవన్ కల్యాణ్ భోజనం వడ్డించారు

9/12

వృద్ధురాలు పోతుల పేరంటాలకు చీర బహూకరించి, రూ.లక్ష ఆర్థిక సాయాన్ని పవన్ కల్యాణ్ అందజేశారు.

10/12

గ్రామంలో అమ్మవారి గుడిని పునరుద్ధరించాలని పోతుల పేరంటాలు పవన్ కల్యాణ్‌కు విజ్ఞప్తి చేసింది. వారంలో పని మొదలుపెడతానని పవన్ కల్యాణ్‌ హామీ ఇచ్చారు.

11/12

పోతుల పేరంటాలతో పవన్ కల్యాణ్‌ మాట్లాడారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.

12/12

పోతుల పేరంటాలు తన స్వగ్రామానికి వెళ్లడానికి పవన్ కల్యాణ్ ఓ వాహనం ఏర్పాటు చేశారు. ఆ వాహనం వరకు స్వయంగా వచ్చి ఆమెను పవన్ కల్యాణ్ పంపించారు.

Updated Date - May 10 , 2025 | 11:45 AM