Pawan Kalyan: మత్స్యశాఖ ఉన్నతాధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కీలక ఆదేశాలు
ABN, Publish Date - Oct 17 , 2025 | 09:16 PM
ఉప్పాడ తీర ప్రాంత గ్రామాల మత్స్యకారుల జీవితాల్లో మెరుగైన మార్పులు తీసుకువచ్చేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులు, శాస్త్రవేత్తలతో చర్చించారు. మత్స్యకారులలో చేపల వేట సామర్థ్యాన్ని మరింత పెంపొందించేందుకు ఉన్న అవకాశాలు, వారికి అదనపు ఆదాయం సముపార్జనకు తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు.
ఉప్పాడ తీర ప్రాంత గ్రామాల మత్స్యకారుల జీవితాల్లో మెరుగైన మార్పులు తీసుకువచ్చేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులు చర్చించారు.
మత్స్యకారులలో చేపల వేట సామర్థ్యాన్ని మరింత పెంపొందించేందుకు ఉన్న అవకాశాలు, వారికి అదనపు ఆదాయం సముపార్జనకు తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు.
100 రోజుల ప్రణాళిక అమలుపై శుక్రవారం ఉదయం క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, మత్స్యశాఖ ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఇటీవల కాకినాడ పర్యటన సందర్భంగా పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని ఉప్పాడ తీర ప్రాంత గ్రామాల మత్స్యకారులు లేవనెత్తిన సమస్యల పరిష్కారానికి 100 రోజుల ప్రణాళికలో భాగంగా ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు, తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకార గ్రామాల్లో సదుపాయాలు కల్పించడంతోపాటు వారి జీవనోపాధిని మెరుగుపర్చేందుకు ఉన్న అవకాశాలు అన్వేషించాలని అధికారులకు సూచించారు.
చేపల వేటలో మెలకువలు నేర్పడం, నైపుణ్యం పెంచడంతో పాటు తగిన సౌకర్యాల కల్పనపైనా దృష్టి సారించాలని తెలిపారు. వీటితోపాటు మత్స్య సంపదను పెంపొందించడం తదితర అంశాలపై విశాఖ సీఎంఎఫ్ఆర్ఐ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జోయ్ కె. కిజాకుడాన్ సలహాలు, సూచనలు డిప్యూటీ సీఎం తీసుకున్నారు.
Updated Date - Oct 17 , 2025 | 09:50 PM