Cyclone Montha: జల దిగ్బంధంలో ఒంగోలు
ABN, Publish Date - Oct 29 , 2025 | 09:56 PM
మొంథా తుపాను తీరం దాటింది. అది క్రమంగా బలహీనపడుతోంది. ఈ తుపాను ప్రభావంతో ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలు పట్టణంలో బుధవారం భారీ వర్షం కురిసింది. రహదారులన్నీ చెరువులను తలపించాయి.
మొంథా తుపాను తీరం దాటింది. అది క్రమంగా బలహీనపడుతోంది. ఈ తుపాను ప్రభావంతో ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలు పట్టణంలో బుధవారం భారీ వర్షం కురిసింది. రహదారులన్నీ చెరువులను తలపించాయి.
అతి భారీ వర్షాల కారణంగా ఒంగోలు నగరం పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది.
జన జీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. నగరంలోని రాకపోకలు దాదాపుగా నిలిచిపోయాయి.
ఒంగోలు కార్పొరేషన్ పరిధిలోని ప్రాంతాలన్నీ పూర్తిగా నీట మునిగాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
మరోవైపు కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా సైతం కొన్ని గంటల పాటు నిలిచిపోయింది.
తుపాన్ తీరం దాటడంతో.. అధికారులు రంగంలోకి దిగి యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు.
అమరావతిలో సీఎం చంద్రబాబు, మంత్రులు నారా లోకేశ్, వంగలపూడి అనితా ఆర్టీజీఎస్ ద్వారా తుపాన్ ప్రభావాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ.. ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలిచ్చారు. దీంతో ప్రమాదం చాలా వరకు నివారించగలిగారు.
Updated Date - Oct 29 , 2025 | 10:00 PM