ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Masula Beach Festival 2025: మసూల బీచ్ ఫెస్టివల్ స్పెషల్ అట్రాక్షన్ ఇవే..

ABN, Publish Date - Jun 07 , 2025 | 07:14 AM

మసూలా బీచ్ ఫెస్టివల్ 2వ రోజు ఘనంగా ప్రారంభమైంది. బీచ్ ఫెస్టివల్‌లో భాగంగా మూడో జాతీయ స్థాయి సీకయాకింగ్ పోటీలను ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు 17 రాష్ట్రాల నుంచి క్రీడాకారులు వచ్చారు. ఏపీలో తొలిసారిగా సీ కయాకింగ్ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీలను ఫెస్టివల్‌కు వచ్చిన పర్యాటకులు ఆసక్తిగా వీక్షిస్తున్నారు. మూడు రోజులపాటు పోటీలు జరగనున్నాయి. ప్రతి రోజూ సాయంత్రం 5గంటల నుంచి స్టేజ్ ఈవెంట్స్ ప్రారంభం కానున్నాయి. సాంస్కృతిక నృత్య ప్రదర్శనతో స్టేజ్ ఈవెంట్స్ ప్రారంభిస్తారు. శుక్రవారం సింగర్ గీతా మాధురితో లైవ్ మ్యూజిక్ షో ఏర్పాటు చేశారు. అలాగే హరి హర వీరమల్లు చిత్ర బృందంతో ప్రత్యేక ప్రదర్శన నిర్వహించారు. ఫెస్టివల్‌లో నటి నిధి అగర్వాల్, జబర్దస్త్ టీమ్ సందడి చేసింది. బీచ్ ఫెస్టివల్‌‌లో బీచ్ కబడ్డీ, బీచ్ వాలీబాల్, కయాకింగ్ వంటి పోటీలు నిర్వహిస్తున్నారు. బీచ్ ఫెస్టివల్ సందర్భంగా 80 అడుగుల అమరావతి ముఖద్వారం ఏర్పాటు చేశారు. టూరిస్టులను ఆకర్షిస్తూ పలు రకాల స్టాల్స్ ఏర్పాటు చేశారు. బీచ్ ఫెస్టివల్ ఏర్పాట్లను ఆసక్తిగా మచిలీపట్నం వాసులు, పర్యాటకులు తిలకిస్తున్నారు. బీచ్ ఫెస్టివల్‌లో ప్రత్యేక ఆకర్షణగా హెలిరైడ్, పారాగ్లేడింగ్, స్పీడ్ బోటింగ్ ఏర్పాటు చేశారు. బీచ్ ఫెస్టివల్‌లో 22 రాష్ట్రాల నుంచి 4000 మందికి పైగా క్రీడాకారులు పాల్గొంటున్నారు. బీచ్ ఫెస్టివల్‌తో మచిలీపట్నం, చిలకలపూడి బీచ్‌లో సందడి వాతావరణం నెలకొంది.

1/16
2/16
3/16
4/16
5/16
6/16
7/16
8/16
9/16
10/16
11/16
12/16
13/16
14/16
15/16
16/16

Updated Date - Jun 07 , 2025 | 07:19 AM