చిత్తూరు గంగినేని చెరువులో చేపలను వేటాడుతున్న గద్దలు..
ABN, Publish Date - Jun 24 , 2025 | 04:13 PM
ప్రస్తుతం గద్దలు ఎక్కడా కనిపించడం లేదు. కానీ చిత్తూరులో అవి ప్రత్యక్షమయ్యాయి. స్థానిక గంగినేని చెరువులోని చేపలను గద్దలు వేటాడుతున్నాయి. చేపల వేటలో అవి ఒకదానితో ఒకటి పోటి పడుతున్నాయి. చెరువు నీటిలో పైకి వచ్చిన చేపలను గద్దలు పట్టుకుని పైకి ఎగిరి పోతున్నాయి. అదీకాక గద్దలా తన్నుకు పోయాడంటారు. ఈ చిత్రాలను చూస్తే ఆ విషయం గుర్తుకు వస్తుంది. చెరువు నీటిలో పైకి వచ్చిన చేప పిల్లలను అమాంతం పట్టుకుని గద్దలు పైకి ఎగిరిపోతున్నాయి.
చేప పిల్లను ఒడిసి పట్టిన గద్ద. అదే చేప పిల్ల కోసం గద్ద వెనక వెళ్తున్న మరో గద్ద
గంగినేని చెరువులో చేపల కోసం కలియ తిరుగుతున్న గద్ద.
చేప పిల్లను ఒడిసి పట్టిన గద్ద.
చేప పిల్లను పట్టిన గద్ద. చేప పిల్ల కోసం వెతుకుతున్న మరో గద్ద.
చేపను తన కాళ్లతో గట్టిగా పట్టుకున్న గద్ద.
గంగినేని చెరువులో చేపల కోసం వేట సాగిస్తున్న గద్దలు
చెరువులో చేపల వేట సాగిస్తున్న గద్దలు
చెరువులో చేపను ఒక్క కాలుతో పట్టుకుని పైకి ఎగురుతున్న గద్ద.
Updated Date - Jun 26 , 2025 | 09:16 PM