Constitution Day Celebrations: సంవిధాన్ దివస్.. మాక్ అసెంబ్లీని అదరగొట్టిన స్టూడెంట్స్
ABN, Publish Date - Nov 26 , 2025 | 03:15 PM
అసెంబ్లీ ప్రాంగణంలో విద్యార్థులతో నిర్వహించిన మాక్ అసెంబ్లీని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిలకించారు. విద్యార్థుల ప్రదర్శన చాలా బాగుందని ఆయన ప్రశంసించారు. రాజ్యాంగ దినోత్సవం ఒక బాధ్యతని, అందరిలో చైతన్యం రావాలని ఆయన అన్నారు.
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా విద్యార్థులతో మాక్ అసెంబ్లీ నిర్వహించారు. పాలక, ప్రతిపక్ష సభ్యుల రూల్స్‌ను విద్యార్థులు అద్భుతంగా ప్రదర్శించారు.
అసెంబ్లీ ప్రాంగణంలో విద్యార్థులతో నిర్వహించిన మాక్ అసెంబ్లీని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిలకించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో పాటు స్పీకర్, మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.
విద్యార్థుల ప్రదర్శన చాలా బాగుందని ముఖ్యమంత్రి ప్రశంసించారు. రాజ్యాంగ దినోత్సవం ఒక బాధ్యతని, అందరిలో చైతన్యం రావాలని ఆయన అన్నారు.
175 నియోజవకర్గాల నుంచి ఎంపికై మాక్ అసెంబ్లీకి వచ్చి నియోజకవర్గం తరపున ప్రాతినిధ్యం వహించినందుకు చాలా సంతోషంగా ఉందని సీఎం కొనియాడారు.
విద్యార్థులు తక్కువ సమయంలోనే ఏ విధంగా ప్రవర్తించాలో అనుసరించి వండర్ ఫుల్‌గా వ్యవహరించారని సీఎం అన్నారు.
ప్రతి ఒక్కరిలో బాధ్యత, చైతన్యం రావడానికి సంవిధాన్ దివస్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్టూడెంట్స్ మాక్ అసెంబ్లీని అదరగొట్టారని..చాలా బాగా రాణించారని సీఎం చంద్రబాబు ప్రశంసించారు.
Updated Date - Nov 26 , 2025 | 03:18 PM