Indrakeeladri Navratri: దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు దంపతులు
ABN, Publish Date - Sep 29 , 2025 | 07:32 PM
నవరాత్రుల్లో భాగంగా విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వారి దేవాలయంలో కొలువు తీరిన దుర్గమ్మ సోమవారం శ్రీసరస్వతి దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ రోజు మూల నక్షత్రం.. అమ్మ వారి జన్మ నక్షత్రం. ఈ నేపథ్యంలో దుర్గమ్మకు సీఎం చంద్రబాబు నాయుడు దంపతులు ఏపీ ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు.
నవరాత్రుల్లో భాగంగా విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వారి దేవాలయంలో కొలువు తీరిన దుర్గమ్మ సోమవారం శ్రీసరస్వతి దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.
ఈ రోజు మూల నక్షత్రం.. అమ్మ వారి జన్మ నక్షత్రం. ఈ నేపథ్యంలో దుర్గమ్మకు సీఎం చంద్రబాబు నాయుడు దంపతులు ఏపీ ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు.
ఈ పట్టువస్త్రాలు సమర్పించేందుకు మధ్యాహ్నం 3.30 గంటలకు దుర్గమ్మ ఆలయానికి సీఎం చంద్రబాబు నాయుడు దంపతులు చేరుకున్నారు.
ఈ సందర్భంగా మేళ తాళాలు.. మంగళ వాయిద్యాలతో వారికి పూర్ణకుంభంతో వేద పండితులు, ఆలయ అధికారులు, మంత్రులు స్వాగతం పలికారు.
అనంతరం సీఎం దంపతులు.. అమ్మవారి దర్శించుకున్నారు. ఆ తర్వాత ఈ దంపతులకు వేద పండితులు వేద ఆశీర్వచనం ఇచ్చారు.
ఆ క్రమంలో అమ్మవారి లడ్డూ ప్రసాదంతోపాటు దుర్గమ్మ చిత్రపటాన్ని సీఎం చంద్రబాబు దంపతులకు దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అందజేశారు.
సీఎం దంపతులకు స్వాగతం పలికిన వారిలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, ఎంపీ కేశినేని చిన్నితోపాటు పలువురు మంత్రులు ఆలయ ఉన్నతాధికారులు ఉన్నారు.
అనంతరం దేవాలయం బయట సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. కనకదుర్గా దేవాలయంలో చేపట్టిన అభివృద్ది పనులు ఆయన వివరించారు. అందులోభాగంగా చేపట్టిన నిర్మాణాలు.. ఎప్పటికి పూర్తవుతాయో తెలిపారు.
అమ్మవారి దర్శనం కోసం వచ్చే సాధారణ భక్తులకు పెద్ద పీట వేస్తున్నట్లు చెప్పారు. ప్రసాదాల్లో నాణ్యత సైతం పెంచేలా చర్యలు చేపట్టామన్నారు.
ప్రభుత్వం తరఫున దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించడం తాను అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. రానున్న కృష్ణా, గోదావరి పుష్కరాలను ఘనం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.
రాష్ట్ర ప్రజలకు సుఖ సంతోషాలు అందించాలని అమ్మవారిని కోరుకున్నానని తెలిపారు. దుర్గమ్మ దయతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోందని.. దీంతో రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ జలకళతో ఉన్నాయని సంతోషం వ్యక్తం చేశారు.
Updated Date - Sep 29 , 2025 | 07:35 PM