CM Chandrababu: సీఎం చంద్రబాబుతో నావి వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లా భేటీ
ABN, Publish Date - Nov 13 , 2025 | 05:54 PM
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ఈస్ట్రన్ నావల్ కమాండ్ కమాండింగ్ ఇన్ చీఫ్ వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లా గురువారం విశాఖపట్నంలో సమావేశమయ్యారు. విశాఖపట్నం వేదికగా సీఐఐ భాగస్వామ్య సదస్సు ఈ రోజు ప్రారంభం కానుంది. ఆ క్రమంలో సీఎం చంద్రబాబును సంజయ్ భల్లా మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ఈస్ట్రన్ నావల్ కమాండ్ కమాండింగ్ ఇన్ చీఫ్ వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లా గురువారం విశాఖపట్నంలో సమావేశమయ్యారు. ఈ రోజు విశాఖపట్నంలో సీఐఐ భాగస్వామ్య సదస్సు ప్రారంభం కానుంది. ఆ క్రమంలో సీఎం చంద్రబాబును సంజయ్ భల్లా మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా నౌకాదళ కార్యకలాపాలను సీఎంకు సంజయ్ భల్లా వివరించారు. రక్షణ వ్యవస్థలో కీలకమైన భారత నౌకాదళానికి సేవలు అందించే కంపెనీలు, స్టార్టప్‌లను రాష్ట్రానికి ఆహ్వానించే అంశంపై ఈ సందర్భంగా వీరిరువురి చర్చించారు. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా స్వదేశీ నౌకా నిర్మాణం, నౌకా సాంకేతికతకు తోడ్పాటును అందించేలా ప్రయత్నం చేస్తున్నట్లు సీఎం తెలిపారు. తూర్పు నావికా దళం నిర్వహించే ఫ్లీడ్ రివ్యూలకు ప్రజల నుంచి వస్తున్న అనూహ్య స్పందనపై ఈ సమావేశంలో చర్చించారు.
విశాఖపట్నం అనేక అవకాశాలకు, ప్రతిష్టాత్మక సంస్థలకు కేంద్రం కాబోతుందన్నారు. విశాఖ భవిష్యత్ నగరంగా మారుతోందని... దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం, నావి కలసి పనిచేయాలని తెలిపారు. విశాఖపట్నం నాలెడ్జ్ ఎకానమీ కేంద్రంగా కానుందని... అదే సమయంలో ఈ నగరాన్ని అత్యుత్తమ టూరిజం సెంటర్‌గా కూడా తీర్చిదిద్దేలా ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. దీనికి తూర్పు నావికాదళం సహకారాన్ని అందించాలని భల్లాను సీఎం కోరారు.
నావి అంటే కేవలం ఫైటింగ్ ఫోర్స్ మాత్రమే కాదని... నావికా దళ విజ్ఞానాన్ని ప్రజలకు చేరువ చేయాల్సిన అవసరం ఉందన్నారు. నావి మ్యూజియం వంటివి ఏర్పాటు చేయడం ద్వారా యువతకు రక్షణ రంగంపై అవగాహన కల్పించాలని సూచించారు. ఏపీలో రక్షణ రంగంలో చేరేందుకు యువత చూపుతున్న ఆసక్తి ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందన్నారు. నావి చేపట్టే వివిధ ప్రాజెక్టులకు, కార్యకలాపాలకు అవసరమైన భూమిని ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దంగా ఉందని వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లాకు సిఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.
Updated Date - Nov 13 , 2025 | 05:54 PM