ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సీఎం చంద్రబాబు అధ్యక్షతన జిల్లా కలెక్టర్ల సమావేశం..

ABN, Publish Date - Dec 17 , 2025 | 09:36 PM

రాజధాని అమరావతిలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జిల్లా కలెక్టర్ల సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశంలో పలువురు మంత్రులతోపాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్లకు సీఎం చంద్రబాబు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.

1/7

రాజధాని అమరావతిలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జిల్లా కలెక్టర్ల సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశంలో పలువురు మంత్రులతోపాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్లకు సీఎం చంద్రబాబు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.

2/7

రాష్ట్రవ్యాప్తంగా 3 వేల ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు వచ్చే అవకాశం ఉందన్నారు. డ్వాక్రా గ్రూపుల ద్వారా ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించాలని సూచించారు. ఈ ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో కనీసం రూ. లక్ష కోట్ల మేర పెట్టుబడులు రావాలని తెలిపారు.

3/7

రూ. 20 లక్షల కోట్ల పెట్టుబడులు సాకారం అయితే... 22 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని ఆయన పేర్కొన్నారు. దావోస్‌కు వెళ్లే ముందు 538 ఎంఓయూలు, రూ.11.38 లక్షల కోట్ల పెట్టుబడులు గ్రౌండింగ్ ప్రాసెస్ మొదలు కావాలని పేర్కొన్నారు.

4/7

175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కులు వస్తాయని చెప్పారు. మంత్రులు, కలెక్టర్లు సంయుక్తంగా ఈ ప్రాజెక్టులను లాంచ్ చేసేలా కృషి చేయాలని ఆదేశించారు. ఈ ప్రాజెక్టులన్నిటికీ భూసేకరణ అత్యంత కీలకం... తమ ప్రభుత్వంలో ఉండగా ఎప్పుడూ భూవివాదాలు రాలేదని గుర్తు చేశారు.

5/7

భూములిచ్చే వారు కూడా సంతోషంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి... భూసేకరణలో ప్రజాప్రతినిధుల సహకారం తీసుకోవాలని ఆదేశించారు. సేవల రంగం కూడా మరింతగా వృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు.

6/7

చాలా ప్రాంతాల్లో పర్యాటకం అభివృద్ధి చెందాలంటే హోటళ్లు కూడా పెద్ద ఎత్తున నిర్మాణం కావాలన్నారు. గిగ్ వర్కర్ల కోసం వర్క్ ఫ్రమ్ హోం సదుపాయాలు కల్పించేలా కలెక్టర్లు కృషి చేయాలని చెప్పారు. యువతలో నైపుణ్యాలు పెంపొందించి ఉద్యోగాల కల్పన ఎలా చేయగలం అనే అంశంపై యాక్షన్ ప్లాన్ చేయడంటూ ఆదేశించారు.

7/7

ఆంధ్రాబ్యాంకు వ్యవస్థాపకుడు భోగరాజు పట్టాభిసీతారామయ్య స్మారకానికి మచిలీపట్నంలో 2 ఎకరాల భూమిని కేటాయించండంటూ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. భోగాపురం ఎయిర్ పోర్టు సమీపంలోనే టౌన్ షిప్ అభివృద్ధి చేయండంటూ ఆ జిల్లా కలెక్టర్‌కు సూచించారు.

Updated Date - Dec 17 , 2025 | 09:37 PM