అయోధ్యలో సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం..
ABN, Publish Date - Dec 28 , 2025 | 02:30 PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యకు చేరుకున్నారు. ఆదివారం ఉదయం అయోధ్యకు చేరుకున్న ఆయనకు ఆ రాష్ట్ర ఉన్నతాధికారులతోపాటు దేవాలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యకు చేరుకున్నారు.
ఆదివారం ఉదయం అయోధ్యకు చేరుకున్న ఆయనకు ఆ రాష్ట్ర ఉన్నతాధికారులతోపాటు దేవాలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు.
ఈ రోజు ఉదయం 9 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరిన సీఎం చంద్రబాబు 11 గంటలకు అయోధ్యకు చేరుకున్నారు.
అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ఆలయంలో కొలువైన శ్రీరాముడిని ఆయన దర్శించుకున్నారు.
ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు సీఎం చంద్రబాబు దేవాలయంలో ఉన్నారు.
అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు అయోధ్య నుంచి బయలుదేరి నేరుగా ఆయన విజయవాడ చేరుకోనున్నారు.
Updated Date - Dec 28 , 2025 | 02:30 PM