ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Alla Nani: చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన ఆళ్ల నాని

ABN, Publish Date - Feb 14 , 2025 | 06:47 AM

మాజీ మంత్రి ఆళ్ల నాని తెలుగుదేశం పార్టీలో చేరారు. ఉండవల్లి నివాసంలో ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. కండువా కప్పి ఆళ్ల నానిని సీఎం చంద్రబాబు పార్టీలోకి ఆహ్వానించారు.

1/5

సుదీర్ఘ కాలం పాటు ఏలూరు ఎమ్మెల్యేగా వ్యవహరించిన మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ నాని గురువారం తెలుగుదేశంలో చేరారు.

2/5

ఇప్పటికే పలుమార్లు టీడీపీలో చేరేందుకు ఆళ్ల నాని ముహూర్తాలు పెట్టుకున్నా చేరిక వాయిదా పడుతూ వచ్చింది.

3/5

ఈ క్రమంలోనే టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నానిని సాదరంగా ఆహ్వానించి పసుపు కండువా కప్పారు. పార్టీకి నిబద్ధతతో పని చేయాల్సిందిగా కోరారు.

4/5

ర్యక్రమంలో సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యే బడేటి చంటి, జిల్లా టీడీపీ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, సీనియర్‌ నేత సుజయ కృష్ణ రంగారావు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఘంటా ప్రసాదరావుతో పాటు నాని తనయుడు పాల్గొన్నారు.

5/5

వైసీపీలో అత్యంత కీలకంగా, అంతకుముందు కాంగ్రెస్‌లోనూ నాని కీలక పాత్ర వహించారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా, ఒకమారు ఎమ్మెల్సీగా, జగన్‌ జమానాలో ఉప ముఖ్యమంత్రి హోదాలో కొనసాగుతూ వైద్య ఆరోగ్య శాఖను నిర్వర్తించారు. ఏలూరు నియోజకవర్గంలో 2009 నుంచే ఆయన క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నారు.

Updated Date - Feb 14 , 2025 | 06:47 AM