TANA Food Drive: 'తానా' నిర్వహించిన ఫుడ్ డ్రైవ్ సక్సెస్
ABN, Publish Date - Dec 24 , 2025 | 11:30 AM
తానా(తెలుగు అసోసియేషన్ అఫ్ నార్త్ అమెరికా) మిన్నియాపాలిస్‌లో నిర్వహించిన ఫుడ్ డ్రైవ్ విజయవంతమైంద. ‘Giving Back to the Community’ అనే నినాదం తో ఈ సంవత్సరం పలు సేవా కార్యక్రమములో పాల్గొని సేవయే తమ ప్రధమ కర్తవ్యంగా ముందుకి వెళుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: తానా(తెలుగు అసోసియేషన్ అఫ్ నార్త్ అమెరికా) మిన్నియాపాలిస్‌లో నిర్వహించిన ఫుడ్ డ్రైవ్ విజయవంతమైంది. ‘Giving Back to the Community’ అనే నినాదం తో ఈ సంవత్సరం పలు సేవా కార్యక్రమములో పాల్గొని సేవయే తమ ప్రధమ కర్తవ్యంగా ముందుకి వెళుతోంది. ఈ కార్యక్రమంలో భాగముగామిన్నియాపాలిస్‌లో ఐఓసీపీ(Interfaith Outreach & Community Partners) అనే ఫుడ్ షెల్ఫ్ సంస్థకు పది సిటీస్ లో ఫుడ్ డ్రైవ్ నిర్వహించి ఫుడ్ షెల్ఫ్ కి కావలిసిన సరుకులను ఆ సిటీస్ లో ఉంటున్న ఎందరో తెలుగు కుటుంబాలు పాల్గొని ఎంతో సహకరించి డొనేషన్ రూపముగా అందజేశారు.
ఈ కార్యక్రమాన్ని తానా నార్త్ సెంట్రల్ టీమ్ ప్రతినిధిరామ్ వంకిన ఆధ్వర్యంలో పలువురు వాలంటీర్స్ సహాయంతో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వాతావరణం మంచుతో , మైనస్ డిగ్రీస్ చలిలో కూడా అందరి సహకారంతో విజయవంతంగా నిర్వహహించారు. ఈ కమ్యూనిటీ ఫుడ్ డ్రైవ్ కార్యక్రమాన్ని తానా ప్రెసిడెంట్ డాక్టర్ నరేన్ కోడలి , వైస్ ప్రెసిడెంట్ శ్రీని లావు, కమ్యూనిటీ సర్వీసెస్ కోఆర్డినేటర్ సాయి బొల్లినేని, స్పెషల్ ప్రాజెక్క్ష్ కోఆర్డినేటర్ నాగ పంచుమర్తి వారి ప్రోత్సాహంతో నిర్వహించడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి వాలంటీర్స్ అయినా వేదవ్యాస్ అర్వపల్లి , బాబ్జి చెన్నుపాటి, మోహన్ వెలగపూడి, అజయ్ తాళ్లూరి , విజయ ముత్యాల , అశోక్ సుంకవల్లి , RK అన్నే, సురేష్ బొర్రా, అభిరాం తాళ్లూరి , కోటేశ్వర రావు పాలడుగు, ఆకాష్ లు సహకారం అందించారు. వీరితో పాటు మరెందరో కూడా సహకారం అందించడం అయినది. ఈ ఫుడ్ డ్రైవ్ నిర్వహించిన మిన్నియాపాలిస్ తానా టీంని ఐఓసీపీ స్టాఫ్ ప్రశంసించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు
Updated Date - Dec 24 , 2025 | 11:33 AM