ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Lord Balaji: జర్మనీలో వైభవంగా.. శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం!

ABN, Publish Date - Nov 04 , 2025 | 07:17 AM

జర్మనీలోని ఫ్రాంక్ఫార్ట్ నగరంలో శ్రీవారి శోభ ప్రజ్వరిల్లింది. తిరుమల వైభవాన్ని ప్రతిబింబిస్తూ, శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అత్యంత భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు.

Lord Balaji Kalyanam in Frankfurt

ఇంటర్నెట్ డెస్క్: జర్మనీలోని ఫ్రాంక్ఫార్ట్ నగరంలో శ్రీవారి శోభ ప్రజ్వరిల్లింది. తిరుమల వైభవాన్ని ప్రతిబింబిస్తూ, శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అత్యంత భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD), ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (APNRTS) సహకారంతో ఈ వేడుకను జరిపారు.

శ్రీ బాలాజీ వేదిక్ సెంటర్ జర్మని (SBVC)ఆధ్వర్యంలో ఈ దివ్య మహోత్సవం జరిగింది. టిటిడి డెప్యూటి ఇ.ఇ. మల్లయ్య పర్యవేక్షణలో టిటిడి వేద పండితుల బృందం వేద ఆచారాలతో, శాస్త్రోక్తంగా శ్రీవారి కళ్యాణ కృతువును నిర్వహించింది. వేద మంత్రోచ్ఛారణలు, సాంప్రదాయ సంగీతం, మంగళ వాయిద్యాలు, పుష్ప అలంకరణలతో వేదిక మొత్తం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది.

ఈ కార్యక్రమానికి కాన్సులెట్ జెనరల్ ఆఫ్ ఇండియా కాన్సులెట్ జెనరల్ శుచితా కిషొర్ (CGI Frankfurt), Königstein im Taunus మేయర్ హెల్మ్, ఇంకా ప్రతినిధులు వారి కుటుంబ సభ్యులతో కలిసి హాజరై, శ్రీవారి దివ్య ఆశీస్సులను పొందారు. విదేశీ నేలపై భారతీయ సంస్కృతికి లభించిన ఈ గౌరవం అందరినీ ఆనందభరితులను చేసింది.

శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణ ఘట్టాన్ని ప్రత్యక్షంగా వీక్షించిన భక్తులు పులకించిపోయారు. అర్చకులు తిరుమలలో జరిగే విధంగా కళ్యాణ కార్యక్రమాన్ని కన్నుల పండుగగా తీర్చిదిద్దారు. వేదిక మొత్తం 'గోవిందా… గోవిందా…' నినాదాలతో మారుమోగింది. కళ్యాణ మహోత్సవంతో పాటు వేద పారాయణం, సాంప్రదాయ అలంకరణలతో ఈ వేడుక ఒక ఆధ్యాత్మికంగా సుసంపన్నమైన పండుగ వాతావరణాన్ని సృష్టించింది.

ఈ పవిత్ర వేడుకలో తెలుగు, తమిళ, కన్నడ, ఇంకా ఇతర భారతీయ రాష్ట్రాల భక్తులతో పాటు, అనేకమంది విదేశీ భక్తులు కూడా పాల్గొని ఆధ్యాత్మిక ఆనందాన్ని ఆస్వాదించారు. అనంతరం భక్తులకు టిటిడి లడ్డు ప్రసాదం, కళ్యాణ ప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు శ్రీక్రిష్ణ జవ్వాజి, సూర్య ప్రకాష్ వెలగా మాట్లాడుతూ, ఫ్రాంక్ఫార్ట్ లో నివసిస్తున్న తెలుగు ప్రజలకు ఈ కళ్యాణోత్సవం ద్వారా ఆధ్యాత్మిక అనుభూతి కలిగించగలగడం తమ భాగ్యమని చెప్పారు.

ఈ వార్తలు కూడా చదవండి..

ఓటర్ల సమస్యకు సత్వర పరిష్కారం

అన్ని జిల్లాల్లో 400 కేవీ సబ్‌స్టేషన్లు

Read Latest Telangana News and National News

Updated Date - Nov 04 , 2025 | 07:28 AM