ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Mini Mahanadu: లాస్ఏంజెల్స్‌లో ఘనంగా మినీ మహానాడు

ABN, Publish Date - Jun 05 , 2025 | 08:11 AM

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా లాస్‌ఏంజెల్స్‌లో మినీ మహానాడు ఘనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లాస్ ఏంజెల్స్ నుంచే కాకుండా శాన్‌డియాగో నుంచి భారీగా ఎన్టీఆర్, టీడీపీ అభిమానులు తరలి వచ్చారు.

Mini MahaNadu in Las Angeles

లాస్ఏంజెల్స్: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి పురస్కరించుకొని లాస్‌‌ఏంజెల్స్‌లో మినీ మహానాడు వేడుకలు ఘనంగా నిర్వహించారు. జూన్ 1వ తేదీన నిర్వహించిన ఈ వేడుకలకు లాస్ఏంజెల్స్‌, శాన్ డియాగో నగరాల నుంచి తెలుగు ప్రజలు భారీగా తరలి వచ్చారు. ఈ కార్యక్రమాన్ని అట్లూరి శ్రీహరి.. జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ప్రసంగించారు. తెలుగు ప్రజలకు ఎన్టీఆర్.. ఎలా గుర్తింపు తెచ్చారో శ్రీధర్ శాతులూరి, సురేశ్ కందేపు వివరించారు. అలాగే మహానాడు చరిత్రతోపాటు ప్రస్తుతం ఈ వేడుకలను ఎలా జరుపుకొంటున్నారో సురేశ్ అయినంపూడి, విష్ణు యలమంచి వివరించారు.


ఇక టీడీపీ భవిష్యత్తుతోపాటు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నాయకత్వంలో రానున్న దశాబ్దాల్లో ఎలా సురక్షితంగా ఉంటుందో ప్రతాప్ మేతారమిట్ట, హేమకుమార్ గొట్టి తెలియజేశారు. ఎన్టీఆర్ కుటుంబం గురించి వివరించడమే కాకుండా.. నందమూరి బాలకృష్ణ క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా చేస్తున్న సేవలను సుమంత్ వైదన వివరించి.. ప్రశంసించారు.


అలాగే వెంకట్ కొలనుపాక మాట్లాడుతూ.. తాను తొలుత ఎన్టీఆర్ సినిమా గొప్పతనానికి ఆకర్షితులై, ఆ తర్వాత సీఎం చంద్రబాబు నాయుడుకి ఎలా వీరాభిమానిగా మారారో సోదాహరణగా వివరించారు. ప్రశాంత్ అల్లాని మాట్లాడుతూ.. తాను ఎన్టీఆర్‌ని విమానంలో కలిసిన సంగతులను ఈ సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. ఇక టీడీపీ ఆవిర్భావం నాటి నుంచి ఆ పార్టీకి ఎలా మద్దతు ఇస్తున్నారో సుబ్బారావు నెలకుడితి, శ్రీనివాస్ కొల్లు వివరించారు.


ఈ మినీ మహానాడు వేడుకలు ముగింపు కార్యక్రమంలో ఎన్టీఆర్ జయంతి కేక్ కట్ చేసి తమ అభిమానాన్ని చాటు కొన్నారు. ఈ కార్యక్రమంలో సురేష్ అంబటి, రామ్ యలమంచిలి, రామ్ యార్లగడ్డ, పరశురాం బోడెంపూడి, రామ్ చదలవాడ, వాసు వెలినేని, శ్రీకాంత్ రామినేని, శ్రీకాంత్ అమినిని, రవి చుండ్రు, వెంకట్ కోరిపెల్ల, కృష్ణ బాసమ్, శ్రీని వంకాయలపాటి తదితరులు పాల్గొన్నారు. ఈ వేడుకలు లాస్‌ఏంజెల్స్‌లో విజయవంతంగా ముగిశాయి. ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహణతో.. లాస్‌ఏంజెల్స్‌లోని టీడీపీ, ఎన్టీఆర్ అభిమానుల అభిమానాన్ని మరోసారి చాటుకొంది.

ఈ వార్తలు కూడా చదవండి..

కులగణనపై కేంద్రం కీలక నిర్ణయం

అమర్‌నాథ్ యాత్రకు ఉగ్ర ముప్పు.. కేంద్రం అలర్ట్

For NRI News And Telugu News

Updated Date - Jun 05 , 2025 | 08:12 AM