Indian Students: ప్రమాదంలో అమెరికా భారతీయులు..ఆ తర్వాత ఇండియాకు రాక తప్పదా..
ABN, Publish Date - Apr 08 , 2025 | 09:42 AM
అగ్రరాజ్యం అమెరికాలో ట్రంప్ వచ్చిన తర్వాత అనేక మార్పులు ప్రకటించారు. దీంతో భారత్ సహా అనేక దేశాల విద్యార్థులకు ఇబ్బందులు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో వారి చదువు తర్వాత స్వదేశాలకు రావాల్సిందేనని చెబుతున్నారు.
ఇటీవల అమెరికాలో ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక నిబంధనలు మార్చారు. సుంకాలు సహా ఇతర దేశాల విద్యార్థులపై కూడా ఆంక్షలు విధించారు. ఇదే సమయంలో భారతీయ విద్యార్థులకు కూడా ఇబ్బందులు తప్పవని నిపుణులు హెచ్చిస్తున్నారు. అమెరికాకు చదువుల కోసం వెళ్లిన భారతీయ విద్యార్థులకు, వారి చదువులు పూర్తయిన తర్వాత వారి కెరీర్ కోసం సరైన అవకాశాలు పొందడంలో కొత్త అడ్డంకులు ఏర్పడనున్నాయి. ఇవి ప్రధానంగా ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (OPT) సంబంధిత కొత్త బిల్లు వల్ల అమల్లోకి రానుంది.
OPT (ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్) అంటే ఏంటి?
OPT అనేది అమెరికాలో చదువుతున్న విదేశీ విద్యార్థులకు, వారి డిగ్రీని పూర్తిచేసిన తర్వాత, కొంత కాలం వృత్తి శిక్షణ పొందేందుకు అనుమతించే ఒక ప్రోగ్రామ్. ఇది ప్రధానంగా STEM (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణితం) రంగాల్లో చదువుతున్న విద్యార్థులకు కల్పించబడుతుంది. విద్యార్థులు తమ చదువులు పూర్తి చేసుకున్న తర్వాత, ఉచితంగా ఈ ప్రోగ్రామ్ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించుకుంటారు. OPT ద్వారా, విద్యార్థులు గ్రాడ్యుయేషన్ అనంతరం 12 నెలల పాటు ఉద్యోగం చేసుకునే అవకాశం పొందుతారు. STEM కోర్సులలో పట్టాలు పొందిన వారు తమ OPT గడవును రెండు సంవత్సరాలు పెంచుకోవచ్చు.
ముప్పు వస్తున్నదేంటి
అయితే, ఈ ప్రోగ్రామ్ పై ప్రస్తుతం కొత్త సవాళ్లను ఎదుర్కొంటున్నారు. అమెరికాలో ప్రవేశపెట్టిన తాజా బిల్లు ప్రకారం, విద్యార్థుల OPT అనుమతి ముగిసే ఛాన్సుంది. ఈ బిల్లు ఆమోదమైతే, అమెరికాలో ఉన్న F-1, M-1 వీసా విద్యార్థులకు OPT ద్వారా ఉద్యోగం చేసుకునే అవకాశం ఉండదు. ఆపై ఆ విద్యార్థులు క్రమంగా వారి దేశాలకు తిరిగి వెళ్లిపోవాలి. ఈ కొత్త బిల్లు అమెరికాలో వలస వ్యతిరేక విధానాల్లో భాగంగా, ట్రంప్ పరిపాలన సమయంలో అమలు చేయనున్నట్లు తెలుస్తోంది.
వీసా కోసం పోటీపడాలని
వలస నిబంధనలను మరింత కఠినం చేయడానికి దీనిని ప్రవేశపెట్టారు. ఈ బిల్లు వలన, భారతీయ విద్యార్థులు మాత్రమే కాదు, అన్ని దేశాల విద్యార్థులు కూడా చదువ తర్వాత వారి సొంత దేశాలకు తిరిగి వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. OPT తరహా పరిస్థితులు అమలులో ఉంటే, విద్యార్థులు తమ ఉద్యోగం పొందడానికి H-1B వీసా కోసం పోటీపడాలని ఫ్లోరిడాకు చెందిన ఇమ్మిగ్రేషన్ నిపుణుడు వెల్లడించారు. H-1B వీసా అనేది అధిక క్వాలిఫికేషన్ కలిగిన వ్యక్తులకు అమెరికాలో ఉద్యోగాలు పొందేందుకు అందించేది.
OPT, H-1B లాటరీ, విద్యార్థుల జీవితంపై ప్రభావం
అమెరికాలో ప్రస్తుతం 300,000+ మంది భారతీయ విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరిలో ఎక్కువ భాగం STEM విద్యార్థులే. వీరంతా తమ OPT గడవు నేరుగా H-1B వీసా ప్రక్రియపై ఆధారపడివుంటారు. అయితే, ఈ బిల్లును అమలు చేస్తే, OPT ప్రోగ్రామ్ ముగియడానికి చాలా సమయం తీసుకోకపోతే, ఆ విద్యార్థులు అమెరికా దేశాన్ని వదిలి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇదే సమయంలో H-1B వీసా కోసం పోటీ తీవ్రత పెరిగిపోతుంది. మరికొంత మంది విద్యార్థులు యునైటెడ్ కింగ్‌డమ్ సహా ఇతర దేశాలకు వెళ్లాలని చూస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
iPhone Prices: ట్రంప్ టారిఫ్ ప్రభావం..ఇకపై రూ.2 లక్షలకు ఐఫోన్ ధరలు..
Business Idea: మహిళలకు బెస్ట్..లక్ష పెట్టుబడితో వ్యాపారం, నెలకు రూ.3 లక్షల ఆదాయం..
Loan Charges: ఏప్రిల్‌లో పర్సనల్ లోన్స్‌పై ప్రధాన బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు
Read More Business News and Latest Telugu News
Updated Date - Apr 08 , 2025 | 10:00 AM